Kollywood : కోలీవుడ్‌లో ఖాళీగా ఉన్న టాప్ చెయిర్.. రజనీ, విజయ్, అజిత్ తర్వాత ఆ వారసుడు ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌తో పోల్చుకుంటే కోలీవుడ్ స్టార్ హీరోలకు ఉండే ఫ్యానిజం, స్టార్ డమ్ వేరే లెవల్. జస్ట్ హీరో కటౌట్ చూసేందుకే థియేటర్లకు వస్తుంటారు. కానీ కొన్ని రోజుల నుండి తమిళ తంబీలను శాటిస్పై చేయడంతో తడబడ్డారు స్టార్స్. రజనీ, కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటులు బాక్సాఫీస్ దగ్గర వరుసగా బోల్తాపడటంతో.. వీరి నెక్ట్స్ సినిమాలపై ఇంట్రస్ట్, బజ్ క్రియేట్ కావడం లేదు. రజనీ, కమల్ మల్టీస్టారర్ ఫిల్మ్స్ చేస్తున్నా మినిమం క్యూరియాసిటీ కలగడం లేదు ఆడియన్స్‌కు.
Also Read : Vikram : విక్రమ్ – శంకర్ మళ్ళీ కలుస్తున్నారు ఈసారి అదిరిపోయే కమర్షియల్ ప్లాన్!
Also Read
- Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
- High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
- SIR Row: ‘‘జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇవ్వాలి’’.. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్..
కోలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలు తేల్చాలంటే రజనీ తర్వాత విజయ్‌కే సాధ్యం అని ఫీలయ్యారు కోలీవుడ్ ఆడియన్స్. దళపతికి ఉన్న ఇంటర్నేషనల్ క్రేజ్ కూడా నెక్ట్స్ ఇతడే తమిళ ఇండస్ట్రీని రూల్ చేస్తాడని ఫిక్సైన టైంలో సడెన్లీ పొలిటికల్ ఎంట్రీ తీసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. పోనీ విజయ్ లేని లోటును అజిత్ పూడుస్తాడు అనుకుంటే.. లైట్ తీసుకున్నాడు తలా. కార్ రేస్‌లపై కాన్సట్రేషన్ చేసి.. కెరీర్‌పై ఫోకస్ తగ్గించాడు. ఒకప్పుడు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విక్రమ్‌లో మళ్లీ ఆ మ్యాజిక్ కనిపించడం లేదు. స్టార్స్ లేకపోవడంతో చిన్న సినిమాలు అక్కడ ఊపిరిపోసుకున్నాయి.. కానీ థియేటర్స్‌లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ బోర్డ్స్ కనిపించాలన్నా.. ఓ జాతర ఎట్మాస్పియర్ అవ్వాలన్నా.. బాక్సాఫీస్ భారీ లెక్కలు చూపించాలన్నా స్టార్స్‌కే సాధ్యం.
Also Read : Naga Chaitanya : మరోసారి తండ్రితో చైతూ స్క్రీన్ షేర్
ఇప్పుడు అక్కడ టాప్ చెయిరే ఖాళీగా మారింది. రజనీ, కమల్ లెగసీని విజయ్, అజిత్ కంటిన్యూ చేస్తే.. ఇప్పుడు ఆ ప్లేస్ తీసుకోవాల్సిన టైం మిగిలిన హీరోలది. ఆ క్యూలో చాలా మందే ఉన్నా.. సూర్య, ధనుష్, శివకార్తీకేయన్, ప్రదీప్ రంగనాథన్ మాత్రమే రీప్లేస్ చేయగలరన్నది క్రిటిక్స్ మాట. సూర్య ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పించగలిగే సినిమాలు అందించి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లు కొడితే.. టాప్ చెయిర్‌లో కూర్చొన్నట్లే. రిస్క్ చేయకుండా, బాడీని కష్టపెట్టకుండా సినిమాలు చేసే ధనుష్ కూడా తమిళ ఆడియన్స్‌పై ఫోకస్ చేస్తే.. నెక్ట్స్ తలైవా అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడిప్పుడే సెలక్టివ్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటోన్న శివకార్తీకేయన్.. రొటీన్ స్టోరీల జోలికి పోకుండా.. సరైన సబ్జెక్ట్‌పై కాన్సట్రేషన్ చేస్తే స్టార్ హీరో ప్లేస్ ఆక్యుపై చేయొచ్చు. నెక్ట్స్ తలైవా, ఉళగనాయగన్.. దళపతి విజయ్ అండ్ తలా పరంపరను కంటిన్యూ చేసే టాప్ హీరోలుగా మారే ఛాన్స్ వీళ్లే తీసుకుంటారా..? మరొకరి అవకాశం ఇస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
-
High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
-
Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!