NTV Telugu Site icon

Telangana New IT Minister: తెలంగాణ కొత్త ఐటీ మంత్రి ఎవరో తెలిసిపోయింది..?

It Minister

It Minister

తెలంగాణలో సీఎం పదవి స్థాయిలోనే ఐటీ శాఖపై చర్చ కొనసాగుతుంది. కొందరు బీఆర్ఎస్ అభిమానులు, నెటిజన్లయితే అధికారం కాంగ్రెస్ దే అయినా ఐటీ మంత్రిగా కేటీఆర్ ను కొనసాగించాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడినప్పటి నుంచి కేటీఆర్ లాంటి గొప్ప ఐటీ మంత్రిని తెలంగాణ కోల్పోయిందంటూ నెట్టింట కొన్ని పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే, ఇంతకు ముందు ఐటీ అంటే కేటీఆర్.. కేటీఆర్ అంటే ఐటీ అనేలా తయారైంది.. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త ఐటీ మంత్రి పదవి ఎవరికి ఇస్తారో అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే కొత్త ఐటీ మంత్రి వీళ్లేనంటూ కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఐటీ శాఖ అప్పగించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఉన్నత విద్యావంతుడు, గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఆయనకు సొంతం.. దీంతో ఆయనయితే ఐటీ శాఖను సమర్ధవంతంగా నిర్వహిస్తాడని టాక్.. కేటీఆర్ పేరును మరిపించగలడని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందట.

Read Also: Earthquake: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. రాజధాని మనీలా ఖాళీ చేయాలని ఆదేశాలు..

ఇక, శ్రీధర్ బాబు కాకపోతే కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఎవరో ఒకరికి ఈ ఐటీ శాఖను అప్పగించే ఛాన్స్ ఉందని టాక్. కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడికే ఐటీ శాఖను అప్పగించాలని అధిష్టానం భావిస్తుందట. దాంతో సీఎం రేసులో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఐటీ శాఖతో పాటు మరికొన్ని కీలక శాఖలు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు చర్చ నెట్టింట జోరుగా సాగుతుంది. లేదంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఐటీ శాఖ బాధ్యతలు ఇచ్చే ఛాన్స్ ఉందని పొలిటికల్ సర్కాల్ లో ప్రచారం కొనసాగుతుంది. మరోవైపు తెలంగాణ కొత్త సీఎం పదవిపై సందిగ్దత నెలకొన్నా రేవంత్ రెడ్డికే ఆ పదవి తన వద్దే పెట్టుకోనున్నాడనే మరో వాదన కూడా వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఐటీని అభివృద్ది చేసేందుకు ఈ శాఖ సీఎం వద్దే వుంటే బావుంటుందని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.