NTV Telugu Site icon

ISI: పాక్ గూఢచార సంస్థ చీఫ్‌గా అసిమ్ మాలిక్.. ఎవరు ఇతను..?

Asim Malik

Asim Malik

ISI: పాకిస్తాన్ గూఢచార ఎజెన్సీ ‘‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మాలిక్ నియమితులైనట్లు పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. సెప్టెంబర్ 30న మాలిక్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. పాకిస్తాన్‌లో ప్రభుత్వం కన్నా అత్యంత శక్తివంతమైన విభాగం ఆ దేశ సైన్యం. సైన్యాధ్యక్షుడి తర్వాత అంతటి శక్తివంతమైన వ్యక్తిగా ఐఎస్ఐ చీఫ్‌ని భావిస్తారు. ఈయన పాకిస్తాన్‌లో నెంబర్ 2గా ఉంటారు.

Read Also: Bangladesh: షేక్ హసీనా సర్కార్ పతనంపై తాత్కాలిక అధ్యక్షుడు యూనస్ సంచలన వ్యాఖ్యలు

ఈ నియామకానికి ముందు మాలిక్ ఆర్మీ జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లో అడ్జటెంట్ జనరల్(ఏజీ)గా పనిచేశారు. గత మూడు ఏళ్లుగా చట్టపరమైన మరియు క్రమశక్షణా వ్యవహరాలతో సహా సైనిక పరిపాలనా వ్యవహరాలను పర్యవేక్షిస్తున్నాడు. పదవీ విరమణ చేసి ఐఎస్ఐ చీప్ జనరల్ నదీమ్ అంజుమ్‌ని నవంబర్ 2021లో అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నియమించారు. సెప్టెంబర్ 2022లో అతడి పదవీకాలం ఒక ఏడాది పొడగించబడింది. ఇదే సమయంలో పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ దిగిపోవాల్సి వచ్చింది. తనను దించేందుకు పాక్ సైన్యం కుట్ర చేసిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యల్ని సైన్యం తిరస్కరించింది.

59 ఏళ్ల మాలిక్‌కి ఇప్పటి వరకు ఇంటెలిజెన్స్ సంబంధిత విభాగాల్లో పెద్దగా అనుభవం లేదు. గతంలో ఈయన బలూచిస్తాన్, దక్షిణ వజీరిస్థాన్ పదాతిదళానికి నాయకత్వం వహించారు. దాదాపు రెండు దశాబ్ధాలుగా హింసకు మారుపేరుగా ఉన్న ఈ రెండు ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం మాలిక్ సొంతం. పాకిస్తాన్ నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీలో పాటు క్వెట్టాలోని కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీలో బోధకుడిగా పనిచేశాడు. మాలిక్ తన శిక్షణ సమయంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారిలో ఒకరు. అసిమ్ మాలిక్.. మాలిక్ మహ్మద్ గులాం కుమారుడు. ఇతను 1990లో త్రీస్టార్ జనరల్‌గా పనిచేశాడు.