NTV Telugu Site icon

JD Vance : ఎవరు ఈ జెడి వాన్స్.. ఆయనకు భారత్‭తో సంబంధం ఏంటి..?

Jd Vance Usha

Jd Vance Usha

JD Vance and Usha Chilukuri Vance: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అధికారిక అభ్యర్థిగా మారారు. అదే సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ ఒహియో సెనేటర్ జెడి వాన్స్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. డోనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి పేరును కూడా ప్రకటించారు. ఈ విషయాన్ని అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తెలిపాడు. ఆ పోస్ట్ లో ట్రంప్ “సుదీర్ఘమైన చర్చల తరువాత, అనేక మంది ఇతరుల ప్రతిభను పరిగణనలోకి తీసుకుని, యునైటెడ్ స్టేట్స్ వైస్ ప్రెసిడెంట్ పదవిని నిర్వహించడానికి అత్యంత అనుకూలమైన వ్యక్తి సెనేటర్ జెడి వాన్స్ అని నేను నిర్ణయించుకున్నాను అంటూ రాసుకొచ్చాడు.

Selfie Video: నవ దంపతులు ఆత్మహత్య.. ఎస్సై కి సెల్ఫీ వీడియో..!

ఒహియో సెనేటర్ జెడి వాన్స్ ఒకప్పుడు ట్రంప్‌ ను విమర్శించేవాడు. కానీ, ఇప్పుడు వాన్స్ అతని ఉత్తమ సహచరులలో ఒకడు అయ్యాడు. జెడి వాన్స్ వయస్సు 39 సంవత్సరాలు. అతను ఆగస్టు 2, 1984 న ఒహియోలోని మిడిల్‌ టౌన్‌ లో జన్మించాడు. వాన్స్ బాల్యంలో చాలా కష్టాలను ఎదురుకున్నాడు. అతని తల్లి మాదక ద్రవ్యల వ్యసనంతో పోరాడింది. ఇక అతని తండ్రి చిన్నపుడే వారిని వదిలేసి వెళ్ళిపోయాడు. దాంతో వాన్స్ తాతలు అతనిని చూసుకున్నారు. జెడి వాన్స్ మెరైన్స్‌ లో పని చేయడం ద్వారా తన వృత్తిని మొదలు పెట్టాడు. అతను ఒహియో స్టేట్ యూనివర్శిటీ, యేల్ లా స్కూల్‌ లో చదువుకున్నాడు. వాన్స్ సిలికాన్ వ్యాలీలో వెంచర్ క్యాపిటలిస్ట్‌గా పనిచేశారు. 2022లో సెనేట్‌కు ఎన్నికయ్యారు. ట్రంప్ “మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్” ఎజెండాకు వాన్స్ స్వర మద్దతుదారు.

JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడి బరిలో తెలుగింటి అల్లుడు..! అది ఎలా..?

ఇకపోతే రిపబ్లికన్‌గా ఉన్న జెడి వాన్స్ 2016లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. ట్రంప్ అధ్యక్ష పదవికి ప్రమాదకరమని అమెరికా హిట్లర్‌గా మరుతున్నాడని ఆయన అన్నారు. అయితే, 2021 నాటికి వాన్స్ అభిప్రాయం మారిపోయింది. ఇక అప్పటి నుండి అతను ట్రంప్ విజయాలను ప్రశంసించడం ప్రారంభించాడు. రిపబ్లికన్ సెనేటర్ రాబ్ పోర్ట్‌మన్ పదవీ విరమణ తర్వాత ఖాళీగా ఉన్న సెనేట్ సీటుపై వాన్స్ రాజకీయ జూదం ఆడాడు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆమోదంతో వాన్స్ అత్యంత పోటీతత్వ రిపబ్లికన్ ప్రైమరీలో విజయం సాధించారు. వాన్స్ సాధారణ ఎన్నికలలో గెలిచి ఒహియో నుండి అమెరికా సెనేటర్‌గా తన స్థానాన్ని పొందాడు.

Post Office GDS Jobs 2024: పరిక్ష లేకుండా పదో తరగతి అర్హతతో పోస్టల్‌‭లో ఉద్యోగాలు..

ఇకపోతే జెడి వాన్స్ భార్య పేరు ఉషా చిలుకూరి వాన్స్. భారత్‌ తో ఆమెకు ప్రత్యేక సంబంధాలు ఉన్నాయి. ఆమె భారతీయ సంతతికి చెందినది. మీడియా నివేదిక ప్రకారం ఉషా చిలుకూరి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ నుండి వలస వచ్చిన భారతీయుల కుమార్తె. ఆమె కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో స్థిరపడింది. ఉష కాలిఫోర్నియాలో జన్మించింది. ఆమె శాన్ డియాగో శివారులో పెరిగింది. అతని తండ్రి మెకానికల్ ఇంజనీర్, తల్లి జీవ శాస్త్రవేత్త. ఉషా చిలుకూరి రాంచో పెనాస్క్విటోస్‌లో ఉన్న ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మౌంట్ కార్మెల్ హై స్కూల్‌ లో చదివారు. ఉషా ముంగెర్ టోల్లెస్ & ఓల్సన్ కంపినీలో శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డిసి కార్యాలయాలలో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఆమె 2015 నుండి 2017 వరకు కంపెనీలో పనిచేసింది. ఆపై 2018 వరకు సుప్రీంకోర్టులో లా క్లర్క్‌గా పని చేసింది.

Raj Tarun: ఎక్కడున్నా మా ముందుకు రావాల్సిందే.. రాజ్ తరుణ్ కు పోలీసుల నోటీసు

38 ఏళ్ల ఉషా చిలుకూరి వాన్స్ అమెరికాలోని ఒక జాతీయ న్యాయ సంస్థలో న్యాయవాది. ఆమె హిందువు. ఆమె భర్త జెడి వాన్స్ రోమన్ క్యాథలిక్. జెడి వాన్స్‌ కు ఆయన భార్య ఉషా వాన్స్ మద్దతు ఉందని అమెరికన్ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది. ఒక నివేదిక ప్రకారం ఉషా చిలుకూరి, జెడి వాన్స్ యేల్ లా స్కూల్‌లో చదువుతున్నప్పుడు 2010లో మొదటిసారి కలుసుకున్నారు. ఆ సమయంలో ‘తెల్ల అమెరికాలో సామాజిక క్షీణత’ అనే అంశంపై చర్చా బృందాన్ని ఏర్పాటు చేశారు. దాంతో త్వరగా ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఇద్దరూ 2014 లో కెంటుకీలో వివాహం చేసుకున్నారు. వీరిఇరువురికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమారులు ఇవాన్, వివేక్. ఒక కుమార్తె మిరాబెల్.

Show comments