Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Who Are The Most Expensive Players In Ipl History

IPL Auction 2025: ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు ఎవరంటే..?

Published Date :November 26, 2024 , 4:00 pm
By Rajesh Veeramalla
  • ఐపీఎల్ వేలం చరిత్రలో కోట్లు కొల్లగొట్టిన ఆటగాళ్లు
  • గత వేలం కంటే.. ఈసారి వేలంలో రికార్డులు బద్దలు
  • మెగా వేలంలో భారత్ ఆటగాళ్లకు రికార్డు ధర
  • టాప్ 10 ఆటగాళ్లలో ఐదుగురు ఇండియన్ ప్లేయర్లు.
IPL Auction 2025: ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు ఎవరంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐపీఎల్ వేలం చరిత్రలో కొంత మంది ఆటగాళ్లు కోట్లు కొల్లగొట్టారు. గత వేలం కంటే.. ఈసారి వేలంలో రికార్డులు బద్దలైంది. ఐపీఎల్‌లో ఇండియన్ బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తుండటంతో.. తాజాగా జరిగిన మెగా వేలంలో భారత్ ఆటగాళ్లు రికార్డు ధర పలికారు. ఐపీఎల్ 2024 సీజన్ వరకు టాప్ 10 ఆటగాళ్లలో కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే భారతీయులు ఉండేది. కానీ ఇప్పుడు ఈ జాబితాలో మరో ఐదుగురు ఆటగాళ్లు చేరారు. అంతే కాకుండా.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో భారత్ ఆటగాళ్లే ఉన్నారు.

Fire Accident : జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం… పరిసర ప్రాంతాల్లో దట్టంగా కమ్ముకున్న పొగ

ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో రిషబ్ పంత్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత.. వేలంలో రూ.25 కోట్ల బిడ్ దాటిన మొదటి వ్యక్తి శ్రేయాస్ అయ్యర్ ఉన్నాడు. ఈ సీజన్‌లో అతడిని పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో.. శ్రేయాస్ రెండో స్థానంలో ఉన్నాడు. గత సీజన్‌లో రూ. 24.75 కోట్లకు అమ్ముడైన మిచెల్ స్టార్క్.. 2024 వరకు ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఉన్నాడు. ప్రస్తుతం అతను మూడవ స్థానంలో ఉన్నాడు.

IPL Auction 2025: మెగా వేలం తర్వాత ఏ టీమ్ బలంగా, బలహీనంగా ఉంది..!

ఈ జాబితాలో నాలుగో పేరు వెంకటేష్ అయ్యర్. ఈ భారత ఆల్‌రౌండర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ ఈసారి రూ. 23.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఐదవ స్థానంలో పాట్ కమ్మిన్స్ ఉన్నాడు. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేసింది. 2023లో పంజాబ్ కింగ్స్ రూ. 18.5 కోట్లకు కొనుగోలు చేసిన సామ్ కుర్రాన్ ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ఇద్దరు ఆటగాళ్లను రూ.18-18 కోట్లకు కొనుగోలు చేసింది. వారిలో ఒకరు అర్ష్‌దీప్ సింగ్ కాగా.. మరొకరు యుజ్వేంద్ర చాహల్ వరుసగా 7, 8 స్థానాల్లో ఉన్నారు. కామెరాన్ గ్రీన్ రూ. 17.50 కోట్లతో 9వ స్థానంలో ఉన్నాడు. చివరగా బెన్ స్టోక్స్ ఉన్నాడు. అతనిని 2023లో రూ. 16.25 కోట్లకుచెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.

ఐపీఎల్ వేలంలో విక్రయించబడిన అత్యంత ఖరీదైన ఆటగాళ్ల జాబితా:
1. రిషబ్ పంత్ – రూ. 27 కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్ – 2025
2. శ్రేయాస్ అయ్యర్ – 26.75 కోట్లు – పంజాబ్ కింగ్స్ – 2025
3. మిచెల్ స్టార్క్ – రూ. 24.75 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్ – 2024
4. వెంకటేష్ అయ్యర్ – రూ 23.75 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్ – 2025
5. పాట్ కమిన్స్ – 20.50 కోట్లు – సన్‌రైజర్స్ హైదరాబాద్ – 2024
6. సామ్ కర్రాన్ – 18.50 కోట్లు – పంజాబ్ కింగ్స్ – 2023
7. అర్ష్‌దీప్ సింగ్ – 18 కోట్లు – పంజాబ్ కింగ్స్ – 2025
8. యుజ్వేంద్ర చాహల్ – 18 కోట్లు – పంజాబ్ కింగ్స్ – 2025
9. కామెరాన్ గ్రీన్ – రూ. 17.50 కోట్లు – ముంబై ఇండియన్స్ – 2023
10. బెన్ స్టోక్స్ – 16.25 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్ – 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Highest Price
  • ipl Auction
  • ipl history
  • most expensive players
  • Rishabh Pant

తాజావార్తలు

  • Cyber Crime Police Crack Down : సైబర్ దొంగలకు షాక్.. కోట్ల రికవరీ ఎలా సాధ్యమైంది..?

  • Tamil Nadu: “పోలీసమ్మ నీకు సెల్యూట్”.. 9 మంది తోటి సిబ్బందికే ఉరిశిక్ష పడేలా చేసిన హెడ్‌ కానిస్టేబుల్..

  • RK Roja: రేవంత్‌రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం.. ఏపీ ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టు..!

  • Thimmarajupalli TV: కిరణ్ అబ్బవరం నిర్మాణంలో ‘తిమ్మరాజుపల్లి టీవీ’.. ట్రైలర్ డేట్ ఫిక్స్!

  • Story Board: ఇరాన్‌ షరతులకి అమెరికా తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions