Whistle : విజిల్ మింగేసిన చిన్నారి.. ఆపరేషన్ తర్వాత వైద్యులు ఏమన్నారంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Whistle : నాలుగేళ్ల పాప గొంతులో విజిల్ ఇరుక్కుపోయింది. బహ్రెయిన్‌లో జరిగిన నస్ఫా వేడుకల్లో చిన్నారి విజిల్ ను మిఠాయి అనుకుని నోట్లో వేసుకుని మింగేసింది. చిన్నారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో వెంటనే సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో చేర్పించారు. చిన్నారి గొంతులో ఇరుక్కున్న విజిల్‌ను వైద్యులు విజయవంతంగా తొలగించారు. వైద్యులు చిన్నారిని అత్యవసర బ్రోంకోస్కోపీకి పంపారు. వైద్యులు అధునాతన ఎండోస్కోప్ని ఉపయోగించి విజిల్‌ను బయటకు తీశారు. ఈ ఆపరేషన్‌లో కెమెరాతో కూడిన ట్యూబ్ శ్వాసనాళంలోకి పంపిస్తారు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీని వైద్య బృందం విడుదల చేసింది. తల్లిదండ్రులు పిల్లలు తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Read Also: Crorepati SIP : ఇలా చేస్తే పదేళ్లలో కోటీశ్వరులు కావడం ఖాయం
Also Read
- Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
- Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
- CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
- Bangladesh: భారత్ నుంచే చుక్కలు చూపిస్తున్న హసీనా.. బంగ్లాదేశ్‌లో లాక్డౌన్!
నస్ఫా అనేది అరబిక్ నెల షాబాన్ సందర్భంగా బహ్రెయిన్‌లో జరిగే వేడుక. ఆ రోజు ప్రతి ఇంట్లో స్వీట్లు చేస్తారు. పిల్లలు ఒకరికొకరు బొమ్మలు మార్చుకుంటారు. చాలా మంది పిల్లలకు మిఠాయిలు కొనడానికి డబ్బులు ఇస్తారు. పిల్లవాడు విజిల్‌ను మిఠాయిగా భావించి మింగేశాడు. ఈ విషయాన్ని బహ్రెయిన్ మీడియా వెల్లడించింది. వేడుకల సమయంలో పిల్లలకు స్వీట్లు, ఇతర వస్తువులు ఇచ్చే సమయంలో అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయాన్ని చిన్నారి తండ్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తల్లిదండ్రులందరూ ఈ విషయాలపై శ్రద్ధ వహించాలని నోట్‌తో అతను ఇవన్నీ పోస్ట్ చేశాడు. తన బిడ్డ ప్రాణాలను కాపాడిన వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్‌గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!