ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా జరుగుతోంది. 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ మహా జాతరకు ప్రపంచం నలుమూలల నుంచి అఘోరీ బాబాలు తరలివచ్చారు. జనవరి13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే మహాకుంభమేళాలో లక్షలాది మంది అఘోరీలు తరలి వస్తున్నారు. ఇదే సందర్భంలో నాగ సాధువుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారి వార్తల్లో నిలుస్తోంది. ఒక మహిళా జర్నలిస్ట్ నాగసాధుని ప్రశ్న అడగగా.. సాధువు ఆమె ముందే బట్టలు విప్పేశాడు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. కుంభమేళాల సమయంలో కనిపించే ఈ నాగ సాధువులను పలు ప్రశ్నలు అడిగేందుకు జర్నలిస్టులు అక్కడికి వెళ్తుంటారు. ఈ సందర్భంగా ఓ మహిళా జర్నలిస్టు సాధువు దగ్గరకు వెళ్లింది. తనది 12 సంవత్సరాల దీక్ష అని సాధువు చెప్పడం వీడియోలో చూడవచ్చు.
READ MORE: Vizag: విశాఖలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు
అయితే.. మిగతా సాధువులు బట్టలు వేసుకోరు కదా? మీరు వేసుకున్నారు? అని అడిగింది. దీంతో ఒక్కసారిగా ఆ సాధువు కింది భాగంలో కట్టుకున్న బట్టను విప్పేస్తారు. ఆ మహిళా జర్నలిస్టు బట్టులు తీసేయొద్దూ.. అని చెబుతు అతడి నుంచి దూరంగా వెళ్తుంది. అయితే ఈ వీడియో మహా కుంభమేళాకు సంబంధించినది కాదు. గతంలో నిర్వహించిన అర్ధ కుంభమేళాకు సంబంధించిందని చెబుతున్నారు. కానీ ప్రస్తుతం కుంభమేళా కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇది ఆరేళ్లి కిందటి వీడియోగా గుర్తించారు.
READ MORE: Sankranthiki Vasthunam: తిరుపతిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ యూనిట్ సందడి..
ఇదిలా ఉండగా.. నాగ సాధువుగా మారడం అనేది ఒక సవాలుతో కూడిన ఆధ్యాత్మిక ప్రయాణం. ఇతర సాధువుల మాదిరిగా కాకుండా, నాగ సాధువులు ‘హఠ యోగా’ను అభ్యసిస్తారు. ఈ సారి మహా కుంభ మేళాకు హాజరైన కొందరు నాగ సాధువులు తమ ప్రత్యేకతతో అందరి చూపు తమవైపు తిప్పుకున్నారు. ఒక నాగ సాధువు అనేక సంవత్సరాలుగా 1.25 లక్షల రుద్రాక్షలను ధరించగా, మరొక సాధువు సాధనలో భాగంగా సంవత్సరాల తరబడి ఒక చేతిని పైకెత్తి ఉంచాడు. నాగ సాధువులు ఎంత అంకితభావంతో ఉంటారో చెప్పేందుకు ఇదో గొప్ప నిదర్శనం.