Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణకు ఏ పార్టీ మద్దతు ఇస్తే ఆ పార్టీకే మద్దతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణకు ఏ పార్టీ మద్దతు ఇస్తే ఆ పార్టీకే మా మద్దతు పలుకుతామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ వెల్లడించారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్లో మాదిగల విశ్వరూప మహా సభలో మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు. నవంబర్ 18 తేదీన హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో లక్షల మందితో మాదిగల విశ్వరూప మహా సభ ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానిస్తున్నామన్నారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిగినప్పుడే వారు పిల్లల చదువులు బాగుపడతాయని, చదువుకున్నవారికి ఉద్యోగాలు వస్తాయని మందకృష్ణ మాదిక తెలిపారు.
Also Read: Chirumarthi Lingaiah: కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశంపై చిరుమర్తి తీవ్ర ఆరోపణలు
Also Read
ఎస్సీ వర్గీకరణ జరిగితే తరాలకు రాబోయే వందల సంవత్సరాలకు మంచి జరుగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణపై రాజకీయ పార్టీల వైఖరి వెల్లడించాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకునే పార్టీకే మాదిగల మద్దతు ఉంటుందన్నారు. కేసీఆర్ మాదిగలకు అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మాకు అన్యాయం చేసిన పార్టీలను మాదిగ పల్లెల్లోకి రాకుండా చేస్తామని మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..