Jailer : జైలర్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్.. ఈ సినిమా ఆగస్టు 10 న థియేటర్స్ లో విడుదల అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తం గా భారీ కలెక్షన్స్ రాబట్టింది.. అదేవిధంగా జైలర్ మూవీ ఓటీటీ లో కూడా అదరగొట్టింది.. ఇదిలా ఉంటే ఈ మూవీ టీవీ లో టెలికాస్ట్ కాబోతుంది… బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా దీపావళి సందర్భం గా టీవీలో రాబోతోంది.తెలుగు, తమిళ, కన్న వెర్షన్ల లో ఒకేసారి టెలికాస్ట్ కానుండగా.. హిందీ వెర్షన్ మాత్రం ఒక రోజు ముందుగానే రానున్నట్లు సదరు ఛానెల్స్ వెల్లడించాయి.జైలర్ మూవీ దీపావళి సందర్భంగా నవంబర్ 12న సాయంత్రం 6.30 గంటలకు జెమిని టీవీలో రానుంది. ఇక తమిళ వెర్షన్ అదే రోజు అదే సమయానికి సన్ టీవీలో, కన్నడ వెర్షన్ ఉదయ టీవీలో వస్తాయి.
జైలర్ హిందీ వెర్షన్ మాత్రం నవంబర్ 11న రాత్రి 8 గంటలకు స్టార్ గోల్డ్ ఛానెల్లో టెలికాస్ట్ కాబోతుంది.. అయితే . మలయాళం వెర్షన్ డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు.నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ జైలర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.600 కోట్లకుపైగా వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రజనీకాంత్ తోపాటు మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, తమన్నా, రమ్య కృష్ణ మరియు సునీల్ నటించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ సినిమాకే మేజర్ హైలైట్ గా నిలిచింది.జైలర్ చిత్రంలో రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండియన్ పాత్ర లో రజినీకాంత్ నట విశ్వరూపం చూపించారు.. ఈ సినిమాలో ఆయన యాక్షన్, స్టైల్, స్వాగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు.థియేటర్, ఓటీటీ లో అదరగొట్టిన జైలర్ మూవీ టీవీ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి..
Also Read
తాజావార్తలు
-
NEET Re Exam : విద్యార్థులకు గుడ్న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Sanjay Raut: తప్పంతా సుప్రీంకోర్టుదే.. ఎంపీల తిరుగుబాటుపై సంజయ్ రౌత్..
-
US: న్యూయార్లో విషాదం.. గుర్రపు బండి పైనుంచి పడి భారతీయ యువకుడు మృతి
-
Ramyakrishna : 12 మంది లవ్ ఫెయిల్యూర్స్’తో రమ్యకృష్ణ డేటింగ్ షో?
-
China Mega Dam: బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్.. భారత్కు కొత్త తలనొప్పి..
ట్రెండింగ్
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!