NTV Telugu Site icon

WhatsApp New Feature: వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్.. ఇక ఆ సమస్యకు చెక్‌!

Whatsapp Status

Whatsapp Status

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ ‘వాట్సాప్‌’ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు జోడిస్తోంది. యూజర్ల కోసం ఇప్పటికే ఎన్నో ఫీచర్లను తీసుకొచ్చింది. తాజాగా మరికొన్ని ఫీచర్లను జోడించేందుకు సిద్ధమైంది. మొబైల్‌ నెంబర్‌ను సేవ్‌ చేయకపోయినా ఓ వ్యక్తికి మెసేజ్‌ చేసే సదుపాయాన్ని తీసుకొచ్చిన వాట్సప్‌.. కాంటాక్ట్‌ సేవ్‌ చేయడంలో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. లింక్డ్‌ డివైజెస్‌లోనే కాంటాక్ట్‌ని సేవ్‌ చేసుకునేలా ఓ ఫీచర్‌ను తెస్తోంది.

వాట్సప్‌లోని చాట్‌లో పేరుతో కనిపించాలంటే.. ప్రైమరీ డివైజ్‌లోనే కాంటాక్ట్‌ని సేవ్‌ చేయాల్సి ఉంటుంది. లింక్డ్‌ డివైజెస్‌లో సేవ్‌ చేసే ఆప్షన్ ఉండదు. చాలామంది యూజర్లు వాట్సప్‌ని ఒకటి కంటే ఎక్కువ డివైస్‌లలో ఉపయోగిస్తుంటారు. అలాంటి వారు కాంటాక్ట్‌ నేమ్ యాడ్‌ చేయడానికి కచ్చితంగా ప్రైమరీ డివైజ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్యకు చెక్‌ పెడుతూ.. లింక్డ్‌ డివైజెస్‌లోనే కాంటాక్ట్‌ని సేవ్‌ చేసేలా ఓ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు వాట్సప్‌ సిద్ధమైంది. ఇప్పటికే కసరత్తులు కూడా మొదలుపెట్టింది. త్వరలోనే ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. వాట్సప్‌ వెబ్‌, విండోస్‌ యూజర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తుంది.

Also Read: Prabhas Birthday: మళ్లీ మళ్లీ చేయాలనుకున్నాడు.. ప్రభాస్‌కు ఇష్టమైన హీరోయిన్ ఎవరంటే?

మరో ఫీచర్‌ని కూడా తీసుకురావాలని వాట్సప్‌ చూస్తోంది. కాంటాక్ట్‌ని ప్రత్యేకంగా వాట్సప్‌లోనే సేవ్‌ చేసే సదుపాయాన్ని తేనుందట. కాంటాక్ట్‌ సేవ్‌ చేసే సమయంలో కేవలం వాట్సప్‌లో యాడ్‌ చేయాలా? లేదా మొబైల్‌లో సైతం యాడ్‌ చేయాలా? అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయట. మనకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. దాంతో ఒకవేళ ఫోన్‌ పోయినా లేదా మొబైల్‌ మార్చినా.. వాట్సప్‌లోని కాంటాక్ట్‌లు అలాగే ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది.