చిన్నారుల భద్రత కోసం WhatsApp కొత్త ఫీచర్.. 13 ఏళ్లలోపు పిల్లల కోసం ‘పేరెంట్ మేనేజ్డ్ అకౌంట్స్’ షురూ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WhatsApp Update: మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) చిన్నారుల భద్రత కోసం కొత్త ఫీచర్ ను తీసుక వచ్చేసింది. 13 ఏళ్లలోపు పిల్లల కోసం ‘పేరెంట్ మేనేజ్డ్ అకౌంట్స్’ (Parent Managed Accounts)అనే ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల వాట్సాప్ వినియోగాన్ని పూర్తిగా పర్యవేక్షించవచ్చు. ముఖ్యంగా పిల్లలు ఎవరితో చాట్ చేస్తున్నారో, ఏ గ్రూపుల్లో చేరుతున్నారో, ప్రైవసీ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయో వంటి విషయాలను తల్లిదండ్రులు నియంత్రించగలరు.
ఈ కొత్త ఫీచర్ ద్వారా తల్లిదండ్రులు కొన్ని ముఖ్యమైన నియంత్రణలు కలిగి ఉంటారు. ఇందులో పిల్లలకు ఎవరు మెసేజ్ పంపవచ్చో తల్లిదండ్రులే నిర్ణయించవచ్చు. ఇంకా పిల్లలు ఏ గ్రూపుల్లో చేరాలి అన్నది కూడా తల్లిదండ్రులే నిర్ణయిస్తారు. అలాగే తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్ రిక్వెస్టులను చెక్ చేయవచ్చు. పిల్లల ప్రైవసీ సెట్టింగ్స్ ను కూడా లాక్ చేయవచ్చు. ఈ సెట్టింగ్స్‌ను పిల్లలు స్వయంగా మార్చలేరు. మార్పులు చేయాలంటే తల్లిదండ్రులు సెట్ చేసిన ప్రత్యేక పిన్ (PIN) అవసరం ఉంటుంది. అయితే ఈ ఫీచర్‌ను ఒక్కసారిగా అందరికీ ఇవ్వకుండా దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా ప్రారంభిస్తున్నారు.
Also Read
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగంపై పెద్ద చర్చ జరుగుతోంది. భారతదేశంలో కూడా కొన్ని రాష్ట్రాలు చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణలు తీసుకురావాలని ఆలోచిస్తున్నాయి. ఇదిలా ఉండగా వాట్సాప్ ను కలిగి ఉన్న మెటా ప్లాట్ ఫామ్ మాత్రం పూర్తిగా నిషేధం విధించడం కన్నా తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండడం మంచిదని భావిస్తోంది.
పేరెంట్ మేనేజ్డ్ అకౌంట్ ఎలా సెట్ చేయాలి?
స్టెప్ 1:
పిల్లల ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి వాట్సాప్ డౌన్లోడ్ చేయాలి. అక్కడ భాషను ఎంపిక చేసి Agree and Continue పై ట్యాప్ చేయాలి. ఇంకా ఆ తర్వాత More Options లో Create a Parent-Managed Account ఎంపిక చేయాలి. అక్కడ పిల్లల ఫోన్ నంబర్ నమోదు చేసి వెరిఫై చేయాలి. ఇందులో పిల్లల జన్మతేదీ నమోదు చేసి వయస్సు నిర్ధారించాలి. ఆ తరువాత ‘Continue’ పై ట్యాప్ చేసి తల్లిదండ్రుల అకౌంట్ తో లింక్ చేయాలి.
స్టెప్ 2:
తల్లిదండ్రుల డివైస్‌ను లింక్ చేయడం కోసం పిల్లల ఫోన్లో కనిపించే QR కోడ్ ను స్కాన్ చేయాలి. ఆ తర్వాత Agree and Continue పై ట్యాప్ చేయాలి. ఇంకా తాము పెద్దవారమని వెరిఫై చేయాలి. ఇక్కడ 6 అంకెల “Parent PIN” సెట్ చేయాలి. PIN నిర్ధారించాక సెటప్ పూర్తి అవుతుంది. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత పిల్లలు తమ పేరు, ప్రొఫైల్ ఫోటో సెట్ చేసుకోవచ్చు. కానీ అకౌంట్‌కు సంబంధించిన ముఖ్యమైన సెట్టింగ్స్ అన్నీ తల్లిదండ్రుల నియంత్రణలోనే ఉంటాయి.
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!