NTV Telugu Site icon

WhatsApp Update: హమ్మయ్య.. ఇకపై వాటికి మాత్రమే నోటిఫికేషన్‌ వచ్చేలా!

Whatsapp

Whatsapp

WhatsApp Update: ప్రముఖ మెసెజింగ్‌ ప్లాట్‌ ఫార్మ్‌ వాట్సప్ తన వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరిచే దిశగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా గ్రూప్ చాట్ ఫీచర్‌కు సంబంధించి ఓ అప్డేట్‌ అనేక మార్పులను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ వినియోగదారుల కోసం ఇవి అందుబాటులోకి వచ్చాయి. వాట్సప్‌ బ్లాగ్‌పోస్ట్‌ ద్వారా ఈ ఫీచర్లను అధికారికంగా ప్రకటించింది.

Read Also: Realme GT7: 7000mAh భారీ బ్యాటరీ, IP69 రేటింగ్ లాంటి ప్రీమియం ఫీచర్లతో రాబోతున్న రియల్‌మీ GT7

ఇక వీటికి సంబంధించిన పూర్తి వివరాలను చూసినట్లైతే.. ఇప్పటివరకు గ్రూప్‌లో ఎవరు యాక్టివ్‌గా ఉన్నారో తెలుసుకోవడం సాధ్యపడేది కాదు. కానీ. ఇకపై గ్రూప్ చాట్‌లో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఉన్న సభ్యుల సంఖ్యను నెంబర్ రూపంలో చూపిస్తుంది. ఇది చాట్‌లో ఉన్న వారిని సులభంగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇకపోతే, కొన్ని సందర్భాలలో గ్రూప్‌లో ఎక్కువ మంది ఉంటే వాటి నుంచి వచ్చే మెసేజులు తరచూ విసుగు తెప్పిస్తుంటాయి. దానితో వాటిని మ్యూట్‌ చేస్తుంటాము. ఇలా చేయడం ద్వారా కొన్నిసార్లు అవసరమైన సమాచారం మిస్ అవ్వచ్చు. ఈ సమస్యకు దృష్టిలో ఉంచుకొని పరిష్కారంగా మెన్షన్‌ లేదా రిప్లయ్‌ చేసినపుడు మాత్రమే నోటిఫికేషన్‌ రావాలనే సెట్టింగ్‌ను వాట్సప్‌ తీసుక వచ్చింది.

ఇక అలాగే ఇప్పటికే వచ్చిన ఎమోజీలపై ట్యాప్‌ చేయడం ద్వారా మన స్పందనను తెలపవచ్చు. కొత్తగా వాట్సప్‌ ఈ ఈవెంట్స్‌ ఫీచర్‌లో ‘Maybe’ అనే ఆప్షన్ ను చేర్చింది. అలాగే ఐఫోన్‌ యూజర్ల కోసం వీడియో కాల్‌లో జూమ్‌, మెరుగైన కాల్‌ క్వాలిటీ , డాక్యుమెంట్ స్కాన్‌, డిఫాల్ట్‌ కాలింగ్‌ యాప్‌ వంటి ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే వాట్సప్‌ ఛానల్స్‌ ద్వారా అడ్మిన్లు కేవలం 60 సెకన్ల వీడియో మాత్రమే షేర్ చేయొచ్చు. అలాగే చాట్‌లో పంపిన వాయిస్‌ మెసేజ్‌కు సంబంధించి టెక్స్ట్‌ ట్రాన్స్‌స్క్రిప్ట్‌ కూడా ఆటోమేటిక్‌గా చూపుతుంది. ఇది వినలేని వారు కూడా మెసేజ్‌ను అర్థం చేసుకునేలా చేస్తుంది.