NTV Telugu Site icon

Whatsapp Update: క్రేజీ ఫీచర్లతో భారీ అప్డేట్‌కు సిద్దమైన వాట్సాప్

Whatsapp

Whatsapp

Whatsapp Update: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. ఈ అప్‌డేట్స్ మీ చాటింగ్ అనుభవాన్ని మరింత సజావుగా, క్రియేటివ్‌గా మార్చేందుకు దోహద పడుతాయి. తాజాగా రాబోయే అప్డేట్‌ లో ఫోటో ఎడిటింగ్, సెల్ఫీ స్టిక్కర్ల తయారీ, మెసేజ్‌లకు త్వరగా రియాక్ట్ అయ్యే ఆప్షన్‌లతో ఈ కొత్త ఫీచర్లు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. వాట్సాప్ కొత్త అప్‌డేట్స్‌లో భాగంగా, ఫోటోలు, వీడియోలకు ప్రత్యేక హంగులు జోడించే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఫోటోలను షేర్ చేసే ముందు వివిధ ఫిల్టర్లు, బ్యాక్‌ గ్రౌండ్స్, విజువల్ ఎఫెక్ట్స్ జోడించవచ్చు. 30కి పైగా క్రియేటివ్ ఆప్షన్లను ఉపయోగించి మీ మెసేజ్‌లను మరింత అర్థవంతంగా మార్చవచ్చు.

Also Read: BCCI: బీసీసీఐ కఠిన ఆంక్షలు.. ఇక నుంచి వారం రోజులు మాత్రమే!

ఇప్పటివరకు అందుబాటులో లేని ఒక కొత్త ఫీచర్ ‘సెల్ఫీ స్టిక్కర్’. ఈ ఫీచర్‌తో మీ సెల్ఫీని స్టిక్కర్‌గా మార్చుకోవచ్చు. “క్రియేట్ స్టిక్కర్” ఆప్షన్ ద్వారా సెల్ఫీ తీసుకుని, దాన్ని వ్యక్తిగతీకరించిన స్టిక్కర్‌గా మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ముందు ముందు ఐఓఎస్ యూజర్ల కోసం కూడా త్వరలోనే విడుదల కానుంది. ఇకపోతే , స్టిక్కర్ లవర్స్‌కి ఓ గుడ్ న్యూస్. ఇప్పుడు మీకు నచ్చిన స్టిక్కర్ ప్యాక్స్‌ను స్నేహితులకు నేరుగా షేర్ చేయవచ్చు. మీ స్నేహితులతో మీ ఫేవరేట్ స్టిక్కర్ ప్యాక్‌లను పంచుకుంటూ మీ చాటింగ్ అనుభవాన్ని మరింత సరదాగా మార్చుకొనే అవకాశాన్ని కల్పిస్తోంది.

Also Read: Sankranti 2025: పల్లెకు బైబై.. మళ్లీ పట్నం బాట.. రద్దీగా హైవేలు..

ఇకపై మెసేజ్‌లకు రియాక్ట్ అవ్వడం మరింత వేగవంతం కానుంది. మెసేజ్‌ పై డబుల్ ట్యాప్ చేస్తే రియాక్షన్ సెట్ అవుతుంది. ఇందులో భాగంగా ఎక్కువగా వాడే ఎమోజీలను స్క్రోలింగ్ మెనూలో నుండి ఎంపిక చేసుకోవచ్చు. వాట్సాప్ 2025లో మరిన్ని కొత్త ఫీచర్లను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా యూజర్ల ప్రైవసీ, డేటా సెక్యూరిటీలకి పెద్ద ప్రాధాన్యత ఇస్తామని సంస్థ పేర్కొంది. మొత్తానికి ఈ అప్‌డేట్స్‌తో వాట్సాప్ చాటింగ్ అనుభవం మరింత సరదాగా, సులభతరంగా మారనుంది. ఫొటో ఎడిటింగ్, సెల్ఫీ స్టిక్కర్లు, స్టిక్కర్ షేరింగ్, మెసేజ్ రియాక్షన్స్ వంటి ఫీచర్లు మీ చాట్ సమయాన్ని మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. వాట్సాప్ యూజర్లకు ఈ కొత్త అప్‌డేట్స్ నిజమైన పండగే.

Show comments