WhatsApp Channels: దిమ్మతిరిగే ఫీచర్ తెచ్చిన వాట్సాప్.. 150 దేశాల సెలబ్రిటీలతో నేరుగా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WhatsApp Directory Search And Reaction Support Rolling Out In India:మెటా యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ టెలిగ్రామ్ తరహాలో కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. వాట్సాప్ ఛానెల్స్ పేరుతో ఈ ఫీచర్ విడుదల చేయబడింది. వాట్సాప్ ఛానెల్స్ లో డైరెక్టరీ సెర్చ్ ఫీచర్‌ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. వన్-వే బ్రాడ్కాస్ట్ టూల్ అయిన ఈ ఛానెల్స్ ఫీచర్‌తో మనకిష్టమైన సెలబ్రిటీలను ఫాలో అయి వారు అందించే అప్డేట్లను పొందవచ్చు. అంతేకాదు వారు పెట్టే మెసేజ్ లకు రియాక్ట్ అయ్యే అవకాశాన్ని కూడా పొందుతారు. ఈ వాట్సాప్ ఛానెల్స్ భారత్‌తో సహా 150 దేశాల్లోని వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయని, ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్స్ ఆప్ బుధవారం ప్రకటించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ ఫీచర్ డెవలపింగ్ మోడ్‌లో ఉందని ప్రకటించారు.
Rashmi Gautam: స్కిన్ షో సనాతన ధర్మంలో భాగమా? అంటూ కౌంటర్.. రష్మి ఘాటు రిప్లై
Also Read
- Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
- TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్‌తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
- 7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
- Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
ఇక రాబోయే వారాల్లో వినియోగదారులందరికీ విడుదల చేయబడుతుంది. మెటా సహ వ్యవస్థాపకుడు, CEO మార్క్ జుకర్‌బర్గ్ తన ఛానెల్లో ఈ విషయాన్ని ప్రకటించారు. ఫీచర్లు, కొత్త అప్డేట్ల గురించి మరింత తెలుసుకోవడానికి వినియోగదారులు అధికారిక WhatsApp ఛానెల్లో కూడా చేరవచ్చని వెల్లడించారు. ఇన్స్టాగ్రామ్ ఇప్పటికే ఇలాంటి ఫీచర్‌ను మొదలుపెట్టగా ఇప్పుడు వాట్సాప్ కూడా ఈ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది. WhatsApp ఛానెల్స్ iOS, Android స్మార్ట్ఫోన్లలో అప్డేట్స్ ట్యాబ్‌లో కనిపించనున్నాయి. ఈ ట్యాబ్‌లో వాట్సాప్ స్టేటస్ మెసేజ్‌లతో పాటు కొత్త వాట్సాప్ ఛానెల్స్ ఫీచర్ కూడా ఉంటుంది. వినియోగదారులు తమ దేశం ఆధారంగా ఫిల్టర్ చేయబడిన మెరుగైన డైరెక్టరీని కూడా యాక్సెస్ చేయవచ్చు, వాట్సాప్‌లో అత్యంత యాక్టివ్‌గా ఉన్న, కొత్త ఫాలోవర్స్ సంఖ్య ఆధారంగా ఫేమస్ అయిన ఛానెల్స్ ను కూడా చూడవచ్చు.
తాజావార్తలు
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్‌తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
-
OTT Releases This Week : తెలుగు నుంచి మలయాళం వరకు… ఈవారం ఓటీటీలో మస్ట్ వాచ్ మూవీస్
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్ 100.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!