Site icon NTV Telugu

WhatsApp Channels: దిమ్మతిరిగే ఫీచర్‌ తెచ్చిన వాట్సాప్‌.. 150 దేశాల సెలబ్రిటీలతో నేరుగా?

Whatsapp Channels

Whatsapp Channels

WhatsApp Directory Search And Reaction Support Rolling Out In India:మెటా యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ టెలిగ్రామ్ తరహాలో కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. వాట్సాప్ ఛానెల్స్ పేరుతో ఈ ఫీచర్ విడుదల చేయబడింది. వాట్సాప్ ఛానెల్స్ లో డైరెక్టరీ సెర్చ్ ఫీచర్‌ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. వన్‌-వే బ్రాడ్‌కాస్ట్ టూల్ అయిన ఈ ఛానెల్స్ ఫీచర్‌తో మనకిష్టమైన సెలబ్రిటీలను ఫాలో అయి వారు అందించే అప్‌డేట్‌లను పొందవచ్చు. అంతేకాదు వారు పెట్టే మెసేజ్ లకు రియాక్ట్ అయ్యే అవకాశాన్ని కూడా పొందుతారు. ఈ వాట్సాప్ ఛానెల్స్ భారత్‌తో సహా 150 దేశాల్లోని వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయని, ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్స్ ఆప్ బుధవారం ప్రకటించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ ఫీచర్ డెవలపింగ్ మోడ్‌లో ఉందని ప్రకటించారు.

Rashmi Gautam: స్కిన్ షో సనాతన ధర్మంలో భాగమా? అంటూ కౌంటర్.. రష్మి ఘాటు రిప్లై

ఇక రాబోయే వారాల్లో వినియోగదారులందరికీ విడుదల చేయబడుతుంది. మెటా సహ వ్యవస్థాపకుడు, CEO మార్క్ జుకర్‌బర్గ్ తన ఛానెల్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. ఫీచర్లు, కొత్త అప్‌డేట్‌ల గురించి మరింత తెలుసుకోవడానికి వినియోగదారులు అధికారిక WhatsApp ఛానెల్‌లో కూడా చేరవచ్చని వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్ ఇప్పటికే ఇలాంటి ఫీచర్‌ను మొదలుపెట్టగా ఇప్పుడు వాట్సాప్ కూడా ఈ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది. WhatsApp ఛానెల్స్ iOS, Android స్మార్ట్‌ఫోన్‌లలో అప్డేట్స్ ట్యాబ్‌లో కనిపించనున్నాయి. ఈ ట్యాబ్‌లో వాట్సాప్ స్టేటస్ మెసేజ్‌లతో పాటు కొత్త వాట్సాప్ ఛానెల్స్ ఫీచర్ కూడా ఉంటుంది. వినియోగదారులు తమ దేశం ఆధారంగా ఫిల్టర్ చేయబడిన మెరుగైన డైరెక్టరీని కూడా యాక్సెస్ చేయవచ్చు, వాట్సాప్‌లో అత్యంత యాక్టివ్‌గా ఉన్న, కొత్త ఫాలోవర్స్ సంఖ్య ఆధారంగా ఫేమస్ అయిన ఛానెల్స్ ను కూడా చూడవచ్చు.

Exit mobile version