* నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ఉదయం 10 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్.. బీఏసీలో సభ ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై నిర్ణయం
* కృష్ణా జిల్లా: నేడు మచిలీపట్నంలో జనసేన పార్టీ వార్షిక ఆవిర్భావ సభ.. బందరు శివారులో పొట్టి శ్రీరాములు పేరుతో సభా ప్రాంగణం.. మధ్యాహ్నం విజయవాడ నుంచి వారాహి వాహనంలో బయల్దేరనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సాయంత్రం నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసగనున్న సభ
* తిరుమల: 21న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. 22వ తేదిన శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం, 21, 22 తేదీల్లో బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన టీటీడీ.. 22న ఆర్జిత సేవలు రద్దు
* బాపట్ల: భట్టిప్రోలు మండలం పెద్ద పులివర్రు లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున…
* గుంటూరు : బృందావన్ గార్డెన్స్ పీఎఫ్ కార్యాలయంలో ఉద్యోగుల పెన్షన్ల మెగా అదాలత్…
* పల్నాడు : విటంరాజు పల్లిలో శాంతి ఆశ్రమం అధ్వర్యంలో సర్వలోక కళ్యాణం కోసం 72 గంటల పాటు నిర్వహిస్తున్న మహా మృత్యుంజయ హోమం నేటితో ముగింపు…
* రేపటి నుంచి ఏపనీలో ఇంటర్మీడియట్ పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు..
* నేడు మచిలీపట్నంలో జరుగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు జిల్లా వ్యాప్తంగా వేలాదిగా తరలి వెళ్ళుతున్న పార్టీ శ్రేణులు, అభిమానులు.. జనసందోహాంతో కిటకిటలాడుతున్న జాతీయ రహదారులు
* నేడు జనసేన పార్టీ 10 వ ఆవిర్భావ దినోత్సవం.. మచిలీపట్నంలోని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి.. ఈ రోజు మధ్యాహ్నం విజయవాడ ఆటోనగర్ నుండి వారాహి లో మచిలీపట్నం వెళ్లనున్న పవన్ కల్యాణ్.. సభా స్థలంలో 1,20,000 మంది కూర్చునేందుకు వీలుగా గ్యాలరీ.. సభకు హజరయ్యే జనసైనికులకు మజ్జిగ, మంచినీరు, స్నాక్స్ ఆహారం అందించే విధంగా 2,000మందితో వాలంటీర్ లు ఏర్పాటు.. కిలోమీటర్ పరిధి వరకు పవన్ కల్యాణ్ ప్రసంగాన్ని వీక్షించేలా 14అడుగుల పొడవు 10అడుగుల వెడల్పు కలిగిన LED స్క్రీన్లను సభా ప్రాంగణంలో ఏర్పాటు..
* ఈ రోజు మచిలీపట్నం జనసేన ఆవిర్భావ దినోత్సవం.. జిల్లా పోలీస్ యంత్రాంగం 400 మంది పోలీసులు, మహిళా పోలీసులు పహారా.. సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉంది. బైక్ ర్యాలీలు నిషేధం.. ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా గట్టి బందోబస్తు .. అందుబాటులో రెండు అంబులెన్సులు, రెండు ఫైర్ ఇంజన్లు.. ఎటువంటి అవాంఛనీయమైన సంఘటన జరగకుండా ప్రశాంతంగా సభ జరుపుకోవాలి… చట్టాన్ని ఉల్లంఘించిన వారిని పై కఠిన చర్యలు తప్పవు-కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా
* నేడు మెదక్ జిల్లా జెడ్పీ సర్వసభ్య సమావేశం.. హాజరుకానున్న మంత్రి హరీష్ రావు
* కాకినాడ: అన్నవరం సత్యదేవుని ఆలయం పునర్నిర్మాణం చేసి నేటికి పదకొండేళ్ళు.. 1934లో ఆలయం సున్నపురాయితో నిర్మాణం,శిథిలావస్థకు చేరడంతో 2012లో పునర్నిర్మాణం.. సత్యదేవుడు, అనంత లక్ష్మీ అమ్మవారు,పరమేశ్వరుడు మూల విరాట్ ను కదపకుండా నిర్మాణం.. 1891లో రత్నగిరి పై ఆవిర్భవించిన సత్యదేవుడు