NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* తిరుమల: శ్రీవారి ఆలయంలో రథస్తమి వేడుకలు.. సప్తవాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్న మలయప్పస్వామి.. సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో మలయప్పస్వామి దర్శనం

* ఆదిలాబాద్‌: నేటితో ముగియనున్న నాగోబా జాతర.. ఐదు రోజుల పాటు ఘనంగా సాగిన నాగోబా ప్రత్యేక పూజలు.. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌, తెలంగాణ నుంచి హాజరైన భక్తులు.. చివరిరోజు దర్శనానికి క్యూ కట్టిన గిరిజనేతరులు

* నేటి నుంచి తెలంగాణలో ఉపాధ్యాయ బదిలీలు.. పదోన్నతులకు సంబంధించిన దరఖాస్తులు 30వ తేదీ వరకు స్వీకరణ

* వైఎస్‌ వివేకా హత్య కేసులో నేడు సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్‌రెడ్డి.. మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ విచారణకు హాజరుకానున్న అవినాష్‌రెడ్డి.. సీఆర్పీసీ 160 కింద అవినాష్‌రెడ్డికి నోటీసులిచ్చిన సీబీఐ

* నేడు సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖ పర్యటన రద్దు

* బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తారకరత్న.. మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక అంబులెన్స్‌లో బెంగళూరుకు తరలింపు.. తారకరత్న వెంట బెంగళూరుకు బాలకృష్ణ, తారకరత్న సమీమణి అలేఖ్యరెడ్డి

* అనంతపురం : ఉరవకొండ పరిధిలోని బూదగవి సూర్యనారాయణ దేవాలయంలో రథసప్తమి వేడుకలు.

* శ్రీ సత్యసాయి : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో చైనీస్ న్యూ ఇయర్ వేడుకలకు ముస్తాబైన ప్రశాంతి నిలయం.. వేడుకల్లో పాల్గొనడానికి తరలి వచ్చిన చైనా దేశస్తులు.

* విశాఖ: నేడు శారదాపీఠంలో రాజశ్యామల యాగానికి హాజరు కానున్న పంజాబ్ గవర్నరు బన్వర్ లాల్ పురోహిత్, తమిళనాడు గవర్నరు రవీంద్ర నారాయణ, మంత్రి రోజా

* అనంతపురం : కళ్యాణదుర్గం మండల పరిధిలోని పాలవాయి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్.

* శ్రీ సత్య సాయి : ధర్మవరం పట్టణంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో రథోత్సవ మహోత్సవం.

* కుప్పం: ఉదయం 8.30 కి ప్రారంభం కానున్న నారా లోకేష్ రెండో రోజు యువ గళం పాదయాత్ర.. కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల నుంచి పాదయాత్ర ప్రారంభం.. గుడుపల్లె మండలం బెగ్గిపల్లెలో గ్రామస్తులతో సమావేశం, కడపల్లెలో టిడిపి సీనియర్ నేతల ఆశీర్వాదo తీసుకోనున్న లోకేష్.. కనుమల దొడ్డిలో ప్రజల నుంచి వినతుల స్వీకరణ, ముఖాముఖి.., కనుమలదొడ్డిలో భోజన విరామం, పార్టీ నేతలతో సమావేశం. తుమ్మిశి చెరువు సమీపంలో పలమనేరు – కుప్పం జాతీయ రహదారి పక్కన బస శిబిరంలో రాత్రి బస.

* అనకాపల్లి జిల్లా: నేడు ప్రసిద్ధిగాంచిన అనకాపల్లి గవరపాలెం గౌరీ పరమేశ్వరుల జాతర. 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు, గౌరీ పరమేశ్వరులను దర్శించుకోనున్న వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు

* గుంటూరు : నేడు మంగళగిరి లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో రథ సప్తమి వేడుకలు.. సూర్యప్రభ వాహనం నుండి సాయంత్రం చంద్రప్రభ వాహనం వరకు ఏడు రథాలపై స్వామివారి ఊరేగింపు

* అంబేడ్కర్ కోనసీమ జిల్లా: నేటి నుంచి అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవాలు.. పదిరోజులపాటు జరగనున్న కళ్యాణోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు, ఈనెల 31న స్వామివారి దివ్యకళ్యాణం, ఫిబ్రవరి ఒకటో తేదీన భీష్మ ఏకాదశి సందర్భంగా రథోత్సవం

* ఆదిలాబాద్: నేడు ఆదిలాబాద్ జడ్పి సర్వసభ్య సమావేశం.. హాజరు కానున్న సభ్యులు.

* నేడు మహరాష్ట్రలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన.. ఈనెల 5న బీఆర్ఎస్ సభ దృష్ట్యా నాందేడ్ జిల్లా లో పర్యటించనున్న మంత్రి.

* యాదాద్రి: రథసప్తమి పురస్కరించుకొని ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగనున్న యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు.

* విజయనగరం జిల్లా: రామస్వామి వారి దేవస్థానం రామతీర్థం నేటి నుంచి రాముల వారి తిరుకల్యాణోత్సవం.. నేడు రథసప్తం పురస్కరించుకొని పందిరిరాట, 30న క్షేత్రపాలుకుడైన సదాశివ స్వామి కళ్యాణం, 1న రాముల వారి తిరు కళ్యాణ మహోత్సవం మూడు వాహనాలు సేవ, 2న స్వామి వారి రథయాత్ర

* వరంగల్ జిల్లాకు నేడు వాల్తేరు వీరయ్య మూవీ టీమ్.. సాయంత్రం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో విజయోత్సవ సభ.. పాల్గొననున్న చిరంజీవి, రవితేజ, శృతిహాసన్, చిత్ర యూనిట్ సభ్యులు.

* వరంగల్‌ జిల్లాలో నేడు మంత్రి హరీష్ రావు పర్యటన.. పర్వతగిరిలోని పర్వతాల శివాలయంలో పూజలు చేయనున్న మంత్రి.. అనంతరం వరంగల్ లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనుల పరిశీలన.

* నిజమాబాద్ జిల్లాలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన.. ఓ ఫంక్షన్ హాల్ లో సాండ్ బాక్స్ కార్యక్రమంలో పాల్గొనున్న కేటీఆర్.. జిల్లా కేంద్రంలో కళాభారతి నిర్మాణానికి భూమి పూజ, కొత్తగా నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జి ప్రారంభోత్సవం లో పాల్గొననున్న కేటీఆర్.

Show comments