Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

1. నేటి నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు. ఆగస్టు 11వరకు కొనసాగనున్న సమావేశాలు. ఉమ్మడి పౌరస్మృతి, ఢిల్లీ పాలనాధికారాలపై కేంద్ర ప్రభుత్వం బిల్లులు తెచ్చే అవకాశం.

2. నేడు విపక్షకూటమి I.N.D.I.A తొలి పార్లమెంటరీ సమావేశం. రాజ్యసభలో ప్రతిపక్షనేత చాంబర్‌లో సమావేశం. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ.

3. హైదరాబాద్‌ శామీర్‌పేట కాల్పుల కేసులో నేటితో ముగియనున్న మనోజ్‌ కస్టడీ. నిన్న సెలెబ్రిటీ విల్లాలో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌.

4. నాంపల్లి కోర్టులో చీకోటి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌. నేడు విచారించనున్న కోర్టు. ఇప్పటికే ముగ్గురు చికోటి భద్రతా సిబ్బంది అరెస్ట్‌. చికోటి పరారీలో ఉన్నట్టు చూపించిన పోలీసులు.

5. నేడు జనసేనలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన పంచకర్ల రమేష్‌.

6. ఉత్తరాదిన కుండపోత వర్షాలు. ముంబై నగరాన్ని ముంచెత్తిన వాన. పాల్ఘర్‌, రాయఘడ్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌. ముంబైలోని పలు ప్రాంతాలకు ఆరెంజ్‌ అలర్ట్. భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థలకు సెలవు.

7. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. తెలంగాణలో వచ్చే మూడు రోజుల కుండపోత వానలు. మహబూబాబాద్‌, సూర్యాపేట, వరంగల్‌, హనుమకొండ, భద్రాద్రి, ఖమ్మం, జనగామ, యాదాద్రిలో అతిభారీ వర్షాలు. భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్‌, మేడ్చల్‌.. రంగారెడ్డి, హైదరాబాద్‌, వికారాబాద్‌లో భారీ వర్షాలు.
బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారిన ఉపరిత ఆవర్తనం. ఏపీలో వచ్చే మూడు రోజులు జోరువానలు. అల్లూరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.

8. భద్రాచలం దగ్గర పెరుగుతున్న గోదావరి నీటిమట్టం. 35.20 అడుగులకు చేరుకున్న నీటిమట్టం. 9. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర
రూ.60,650 లు ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,600 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.82,000 లుగా ఉంది.

10. నేడు కేరళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ అంత్యక్రియలు. కొట్టాయం జిల్లాలోని పుథుపల్లిలో అంత్యక్రియలు.

11. నేడు ప్రాజెక్ట్‌ K టైటిల్‌ రివీల్‌ చేయనున్న యూనిట్‌. నిన్న ప్రాజెక్ట్‌ K మూవీలో ప్రభాస్‌ లుక్‌ రిలీజ్. నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా. ప్రధాన పాత్రల్లో అమితాబ్‌, కమల్‌, దీపికా పదుకొనే.

12. నేటి నుంచి భారత్‌-విండీస్‌ మధ్య రెండో టెస్ట్‌. క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌ వేదికగా రాత్రి 7.30గంటలకు మ్యాచ్‌.

Exit mobile version