1. నేడు తిరుమలకు సుప్రీంకోర్టు సీజేఐ లలిత్. శ్రీవారి గరుడవాహన సేవలో పాల్గొననున్న సీజేఐ.
2. నేడు 24వ రోజు కొనసాగనున్న రాహుల్ భారత్ జోడో యాత్ర.
3. నేడు 5జీ సేవలు ప్రారంభించనున్న ప్రధాని మోడీ. ప్రగతి మైదాన్ వేదికగా ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో 5జీ సేవలు ప్రారంభం.
4. నేడు వేములవాడలో గవర్నర్ తమిళిసై పర్యటన. సాయంత్రం 6 గంటలకు రాజన్నను దర్శించుకోనున్న తమిళిసై.
5. నేడు తెలంగాణకు బీజేపీ ఇంచార్జ్ సునీల్ బన్సల్. మునుగోడు ఉప ఎన్నిక కమిటీతో భేటీ కానున్న బన్సల్.
6. నేడు వరంగల్‌కు సీఎం కేసీఆర్. ప్రతిమ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్. రోడ్డు మార్గంలో వరంగల్ వెళ్లనున్న కేసీఆర్.
7. తిరుమలలో నేడు శ్రీవారి గరుడ సేవ. 4 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. ఐదెంచెల భారీ భద్రత ఏర్పాటు.
8. నేటి నుంచి మహిళల ఆసియా క్రికెట్ కప్. మధ్యాహ్నం 1గంటకు శ్రీలంకలో భారత్ ఢీ. ఆసియా కప్ టోర్నీలో పోటీపడుతున్న 7 జట్లు. టోర్నీకి ఆతిథ్యమిస్తున్న బంగ్లాదేశ్.
9. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,650లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,900లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.61,500లుగా ఉంది.