NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* హైదరాబాద్‌: నేడు అసెంబ్లీ సమావేశాల్లో 19 శాఖల పద్దులపై చర్చ.. ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దు

* అమరావతి: నేడు ఆర్టీసీ, రవాణాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, బస్సుల సౌలభ్యంపై చర్చ.. కర్ణాటక, తెలంగాణలో ఫ్రీ బస్సు అమలుపై అధ్యయనం చేసే యోచన.

* అమరావతి: నేడు గృహనిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష..

* ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ వద్ద కేంద్ర బడ్జెట్ లో జిల్లాకు సరైన కేటాయింపులు చేయకపోవటానికి నిరసనగా కోసాన్ మోర్చా ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతుల దహన కార్యక్రమం..

* నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో పార్టీ నేతల సమావేశం

* భద్రాచలం వద్ద వేగంగా తగ్గుతున్న గోదావరి వరద ఉధృతి.. 48 అడుగులకు తగ్గిన తర్వాత రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

* ప్రస్తుతం భద్రాచలం వద్ద 47 అడుగుల వద్ద కొనసాగుతున్న వరద నీటిమట్టం.. 43 అడుగులకు తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించే అవకాశం

* అనంతపురం : అనంతపురం ప్రభుత్వ ఆస్పుత్రిని తనిఖీ చేసి, అనంతరం సమీక్ష సమావేశంలో పాల్గొననున్న మంత్రి సత్యకుమార్.

* అనంతపురం : ఉరవకొండ నియోజకవర్గంలోని నింబగల్లు, కొనకొండ్ల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల పరిశీలించనున్న ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్

* శ్రీ సత్యసాయి : బత్తలపల్లి మండల పరిధిలో ఉన్న 401 సర్వే నెంబర్ లో 19:84 ఎకరాల్లో గుడిసెలు వేసుకున్న లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశం నిర్వహించనున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.

* తూర్పుగోదావరి జిల్లా: ధవళేశ్వరం బ్యారేజి వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి వరద ఉధృతి.. బ్యారేజీ వద్ద 15. 60 అడుగులకు తగ్గిన నీటిమట్టం.. బ్యారేజ్ నుండి 15 లక్షల 94, క్యూసెక్కుల మిగులు జిల్లాలు సముద్రంలోకి విడుదల.. కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

* అమరావతి: రాజధాని గ్రామాల్లో నేడు మున్సిపల్ మంత్రి నారాయణ పర్యటన.. టిడ్కో ఇళ్లను, వసతులను పరిశీలించనున్న మంత్రి

* నేడు బెజవాడలో కనెక్ట్ ఏపీ 2024 ఎక్స్ పో టెక్నికల్ సెమినార్.. 3 రోజుల పాటు జరగనున్న కార్యక్రమం