NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

విజయదశమి పండుగ సమయంలో టీడీపీ నిరసనలపై పోలీసులు అలర్ట్‌ అయ్యారు. జగనాసుర దహనం పేరిట నిరసనలకు నారా లోకేష్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో టీడీపీ నిరసనల వల్ల హింస చెలరేగే అవకాశం ఉందని పోలీసుల ముందస్తు చర్యలు తీసుకున్నారు. ప్రజల విశ్వాసాలను, మనోభావాలను దెబ్బతీసే నిరసనల వల్ల ఘర్షణలు తలెత్తే అవకాశాలపై అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి పోలీసు అధికారుల ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు రిమాండ్ 45వ రోజుకు చేరింది. స్కిల్ డవలప్ మెంట్ స్కాంలో గత నెల 9వ తేదీన అరెస్టయిన చంద్రబాబు.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. నవంబర్ 1వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్ గడువు పొడిగించారు. నేడు చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ కానున్నారు. నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మిణిలు బాబుతో ములాఖత్ అవుతారు.

ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ-జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ జరగనుంది. రాజమండ్రిలోని హోటల్ మంజీరాలో టీడీపీ-జనసేన తొలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరుగనుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలు, ఇరు పార్టీల సమన్వయంపై కమిటీ చర్చించనుంది.

నేడు శ్రీశైలంలో 9వ రోజు దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. సాయంత్రం సిద్ధిదాయిని అలంకారంలో భక్తులకు శ్రీభ్రమరాంబికాదేవి దర్శనమివ్వనున్నారు. అశ్వవాహనంపై ఆశీనులై అది దంపతులు పూజలందుకోనున్నారు. రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి, అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుంది. సాయంత్రం ప్రభుత్వం తరపున మంత్రి గుమ్మనూర్ జయరామ్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే?

నేడు విజ్ఞాన్ యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ హాజరుకానున్నారు. ఆపై సీతారామన్ మాట్లాడనున్నారు.

ప్రపంచకప్‌ 2023లో నేడు పాకిస్తాన్‌, అఫ్గానిస్తాన్‌ తలపడనున్నాయి. చెన్నైలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. బాబర్‌ ఆజమ్‌ బృందంతో పోల్చితే.. ఏ రకంగా చూసినా కూడా అఫ్గాన్‌ కూనే. అయితే ఈ ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్‌లపై 270 పైచిలుకు పరుగులు చేయడం.. మ్యాచ్‌ను పలుపు తిప్పే స్పిన్నర్లు ఉండటంతో షాహిది సేనను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు.