NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

*నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.

*నేటి నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. రేపు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న కేంద్ర ప్రభుత్వం.

*శ్రీశైలం: నేడు శ్రీస్వామి అమ్మవారికి వెండి రథోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ.. సోమవారం వారాంతపు సేవలలో భాగంగా అమ్మవారికి సేవ..

*కోనసీమ జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి.. పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్.

*అల్లూరి జిల్లా: రంపచోడవరంలో స్కూళ్లకు ఇవాళ, రేపు సెలవులు.. చింతూరు డివిజన్‌లోని పాఠశాలలకు ఇవాళ, రేపు సెలవులు.. చింతూరు, వీఆర్‌పురం, ఎటపాక, కూనవరంలో స్కూల్స్‌కు సెలవులు.

*భద్రాచలం వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక .. 46.5 అడుగుల వద్ద గోదావరి నీటిమట్టం.. ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షం.. పునరావాస కేంద్రాలు సిద్ధం చేసుకుంటున్న అధికారులు

*తూర్పుగోదావరి జిల్లా: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.. 10.75 అడుగులకు చేరుకున్న వరద నీటిమట్టం.. 10 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న జో బైడెన్.. దేశ ప్రయోజనాల కోసమే తప్పుకున్నట్లు వెల్లడి.. ప్రెసిడెంట్‌గా పూర్తికాలం కొనసాగుతానన్న బైడెన్.. కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న బైడెన్.