NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

ఇవాళ మూడోరోజు దావోస్‌లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం దావోస్‌కు వెళ్లారు.

సౌత్ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతూ మరణించిన జవాన్ కార్తీక్ పార్దీవదేహం నేడు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఎగువ రాగిమానుపెంటకు చేరుకోనుంది.

నేడు రాజమండ్రిలో జై బాపూజీ, జై భీం, జై సంవిధాన్ ర్యాలీ జరగనుంది. జై బాపూజీ, జై భీం, జై సంవిధాన్ వివాదంతో అఖిల భారత కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు ర్యాలీ జరగనుంది.

రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నేడు హైదరాబాదులో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

రెండవ రోజు హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను బాలయ్య బాబు ప్రారంభించనున్నారు.

నేడు మంత్రి కొల్లు రవీంద్ర అనకాపల్లిలో పర్యటించనున్నారు. కలెక్టరేట్లో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

నేడు కాళేశ్వరం కమిషన్ రెండోరోజు విచారణ జరగనుంది. నేటి నుంచి కమిషన్ ముందుకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నారు. వరసగా మూడు రోజులు పాటు ప్రతినిధులను కాళేశ్వరం కమిషన్ విచారించనుంది.

తెలంగాణ రాష్ట్రంలో రెండోరోజు గ్రామసభలు కొనసాగనున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు కొనసాగుతున్నాయి.

నేడు కరీంనగర్ జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. మానకొండూర్ నియోజకవర్గ పరిధిలోని రేణికుంట, వేములవాడ నియోజకవర్గ పరిధిలోని రుద్రంగి మండల కేంద్రంలో , ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని జైన గ్రామాల్లో మంత్రుల పర్యటించనున్నారు.

వరంగల్ జిల్లాలో జేఈఈ మెయిన్స్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈరోజు అనంతపురంలో నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకూ మహారాజ్’ విజయోత్సవ సభ జరగనుంది.

ఈరోజు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలో తొలి పోరు జరగనుంది.