Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* ఇవాళ టీ-20 వరల్డ్‌ కప్‌కు భారత జట్టు ప్రకటన.. మధ్యాహ్నం ఒంటి గంటకు టీ-20 వరల్డ్‌ కప్‌కు టీమ్‌ను ప్రకటించనున్న బీసీసీఐ

* నేడు అనకాపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన.. కశింకోట మండలం తాళ్లపాలెంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం.. అనకాపల్లిలో వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం చంద్రబాబు

* తూ.గో.: నేడు నిడదవోలులో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటన.. రూ.1,400 కోట్లతో చేపట్టిన వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును ప్రారంభించనున్న పవన్‌

* ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ కార్యాలయం మార్పు.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి సీసీఎస్ కు సిట్ కార్యాలయం మార్పు.. నేటి నుంచి సీసీఎస్ లోనే సిట్ కార్యకలాపాలు.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు..

* హైదరాబాద్: నేడు సికింద్రాబాద్ నియోజకవర్గం, జీరా, గుండా ఈశ్వరయ్య మెమోరియల్ ప్రభుత్వ పాఠశాలలో ఫర్నిచర్ పంపిణీ చేయనున్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి.. మౌలాలి RPF ట్రైనింగ్ సెంటర్ లో జరిగే (26th All india Police band competition -2025) బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు

* నేడు సంగారెడ్డి, ఆందోల్ నియోజకవర్గాల్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన.. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన BRS సర్పంచ్ లకు సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్న హరీష్ రావు

* ఉమ్మడి మెదక్ జిల్లాని వణికిస్తున్న చలి.. గడిచిన 24 గంటల్లో కోహిర్ లో 5.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో సింగిల్ డిజిట్ కి పడిపోయిన ఉష్ణోగ్రతలు

* అమరావతి: నేడు మధ్యాహ్నం టీడీపీ కేంద్ర కార్యాలయానికి మంత్రి లోకేష్. టీడీపీ జిల్లా అధ్యక్షులు కమిటిలు ప్రకటించే అవకాశం…. త్వరలో రాష్ట్ర కమిటీల ఎంపిక పై కసరత్తు

* అనంతపురం : రాప్తాడు సమీపంలోని ఏపీ మోడల్ స్కూల్ లో నేడు జిల్లా స్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శన

* పల్నాడు జిల్లా: నేడు‌ పిడుగురాళ్లలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రానున్న విగ్రహాలు, పూజారులు. శ్రీనివాస కళ్యాణానికి వచ్చే భక్తుల కోసం భారీగా ఏర్పాట్లు.

* తిరుమల: 8 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 64,729 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 22,162 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.31 కోట్లు

* కాకినాడ: నేటి నుంచి పిఠాపురంలో రెండు రోజులపాటు రాష్ట్రస్థాయి ఉమెన్ బాక్సింగ్ పోటీలు.. 26 జిల్లాల నుంచి పాల్గొనున్న 150 మంది మహిళా బాక్సర్లు.. ఈ పోటీలలో ప్రతిభ చూపిన వారికి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్న ఏపీ బాక్సింగ్ అసోసియేషన్

* నంద్యాల: బనగానపల్లె లో నేడు ఎంపీడీవో కార్యాలయం నుండి ప్రారంభిచనున్న స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీలో పాల్గొననున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.

Exit mobile version