Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

నేడు సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అలంపూర్, మధ్యాహ్నం 3కి కొల్లాపూర్, సాయంత్రం 4 గంటలకు నాగర్ కర్నూల్, సాయంత్రం 5 గంటలకు కల్వకుర్తి ప్రజా ఆశీర్వాద సభలలో సీఎం మాట్లాడనున్నారు.

నేడు మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు నారాయణపేటలో సకల జనుల విజయసంకల్ప సభలో ఆయన పాల్గొననున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నారు. ఖానాపూర్, ఆసిఫాబాద్ రెండు నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఆమె పాల్గొననున్నారు. ముందుగా నాందెడ్ నుంచి చాపర్ ద్వారా ఖానాపూర్ చేరుకుంటారు. ఈ సభ తరువాత ఆసిఫాబాద్ సభకు ప్రియాంకహజరు అవుతారు.

నేడు ధర్మపురి అసెంబ్లీ పరిధిలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్నారు. మొదట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు చేస్తారు. గొల్లపల్లి, పెగడపెళ్లి మండలాల్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో కవిత ప్రసంగించనున్నారు.

జగిత్యాల జిల్లా ఎండపెళ్లి మండలం రాజారాంపల్లెలో కాంగ్రెస్ ప్రచార రోడ్ షోలో తీర్మార్ మల్లన్న పాల్గొననున్నారు.

Also Read: IND vs AUS Final 2023: భారత్‌, ఆస్ట్రేలియా ఫైనల్‌ మ్యాచ్‌.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే?

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. రామాలయంను దర్శించుకున్న ఆనంతరం కేటీఆర్ రోడ్ షోలో పాల్గొననున్నారు.

భారత గడ్డపై ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఫైనల్ పోరు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. భారత్ గెలవాలని పూజలు చేస్తున్నారు.

Exit mobile version