Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Whats Today On 19th January 2025 In Telangana And Ap

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Published Date :January 19, 2025 , 7:31 am
By Sampath Kumar
  • విజయవాడలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన
  • నేటి నుంచి కొమురవెళ్లి జాతర ఆరంభం
  • సింగపూర్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి బృందం పర్యటన
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు విజయవాడలో పర్యటించనున్నారు. బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించి.. ఏపీ బీజేపీ కొత్త సారథిపై చర్చించనున్నారు. కేంద్ర హోంమంత్రి పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు.

నేడు దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఏపీ సీఎం ఇవాళ అర్ధరాత్రి ఢిల్లీ నుంచి జ్యురిచ్ బయలుదేరనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో నాలుగు రోజుల పాటు ఆయన పాల్గొననున్నారు.

రాజమండ్రి సత్యసాయి గురుకులంలో సాయంత్రం 5 గంటలకు మహా సహస్రావధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరికిపాటి నరసింహారావు ప్రవచనం చేయనున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత వసంతాల వేడుకల్లో మొట్టమొదటి కార్యక్రమంగా ఈ ప్రవచనం చేయనున్నారు.

నేటితో తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్నాయి. పది రోజుల వ్యవధిలో 6 లక్షల 80 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.

నేడు విశాఖ GVMC గాంధీ విగ్రహం దగ్గర కమ్యూనిస్టు పార్టీల నిరసన కార్యక్రమం జరగనుంది. స్టీల్ ప్లాంటుకు సొంతగనులు కేటాయించాలని, సెయిల్లో విలీనం చేయాలని, స్టీల్ ప్లాంట్‌ను అమ్మే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేయనున్నారు.

ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోటి, గాలివీడు మండలాలలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటించనున్నారు.

నేటి నుంచి సిద్దిపేట జిల్లాలోని కొమురవెళ్లి మల్లికార్జున స్వామి జాతర ఆరంభం కానుంది. రెండు నెలల పాటు మల్లికార్జున స్వామి ఉత్సవాలు జరగనున్నాయి.

నేడు ఖమ్మం జిల్లాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు భట్టి శంఖుస్థాపన చేయనున్నారు.

సింగపూర్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. నిన్నటి పర్యటనలో తెలంగాణలో రూ.3,500 కోట్ల పెట్టుబడులకు ఎస్టీ టెలీమీడియా గ్లోబల్‌ డేటా సెంటర్‌ ముందుకు వచ్చింది.

5 టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆడేందుకు భారత్, ఇంగ్లాండ్‌ జట్లు శనివారం కోల్‌కతాకు చేరుకున్నాయి. నేటి నుంచి ప్రాక్టీస్ మొదలెట్టనున్నాయి.

ఇండియా ఓపెన్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీ సహా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2025లో భాగంగా నేడు కీలక మ్యాచులు జరగనున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap news
  • ntv
  • telangana news
  • whats today

తాజావార్తలు

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • PM Modi: ఇది చరిత్ర సృష్టించే సమయం.. మహిళా రిజర్వేషన్లకు ప్రధాని మద్దతు..

  • Honor 11000mAh Battery: పవర్ బ్యాంక్ అవసరం లేని ఫోన్.. 11,000mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కు రెడీ..

  • WhatsApp New Feature: వాట్సాప్ సరికొత్త కొత్త ఫీచర్.. బిజినెస్‌ లావాదేవీల కోసం కోసం ప్రత్యేక విభాగం..!

  • Delimitation Bill: మీ టికెట్లు అన్నీ ముస్లిం మహిళలకు ఇవ్వండి.. అఖిలేష్‌కు అమిత్ షా కౌంటర్..

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions