* నేడు ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ కీలక భేటీ.. ఉదయం 11 గంటలకి సమావేశం.. ఏఐసీసీ చీఫ్ ఖర్గే అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరుకానున్న.. రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు..
* నేడు చెన్నూర్ పట్టణంలో బంద్ పై ఎమ్మెర్వో ఉత్తర్వులు.. బంద్ పేరుతో ఎవరైనా అక్రమంగా, దౌర్జన్యంగా వ్యాపార సముదాయాలను బంద్ చేయించిన, వ్యాపారస్థులను బెదిరించిన.. ముందస్తు అనుమతులు లేకుండా నిరసన కార్యక్రమాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెర్వో ఉత్తర్వులు..
* నేడు మంచిర్యాల జిల్లా బంద్ కు బీ ఆర్ఎస్ పార్టీ పిలుపు.. బాల్క సుమన్ అరెస్టును నిరసిస్తూ బంద్ కు పిలుపు.. చెన్నూర్ లో( 163 bns) 144 సెక్షన్ విధించినట్లు పోలీసుల ప్రకటన.. బంద్ పేరుతో దౌర్జన్యంగా షాపులు బంద్ చేయిస్తే చట్ట పరమైన చర్యలు.. ముందస్తు అనుమతి లేకుండా నిరసనలు చేపట్టొద్దని చెన్నూరు పోలీసుల హెచ్చరిక..
* నేడు సాయంత్రం జైపూర్ వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు.. IAS అధికారి వికాస్ వివాహ వేడుకకు హాజరు కానున్న సీఎం.. రేపు జైపూర్ నుంచి ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఏఐ సమిట్లో పాల్గొననున్న ఏపీ ముఖ్యమంత్రి.. రేపు సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చంద్రబాబు..
* నేడు మధ్యాహ్నం 2 గంటలకు మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియా సమావేశం.. తాడేపల్లి వైసీపీ సెంట్రల్ ఆఫీస్ లో జగన్ ప్రెస్ మీట్.. ఏపీ బడ్జెట్, లడ్డూ ఇష్యూతో పాటు ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడే ఛాన్స్..
* నేడు ఉదయం 9 గంటలకు ప్రారంభంగానున్న శాసనసభ సమావేశాలు.. క్వశ్చన్ అవర్ తో శాసనసభ సమావేశాలు ప్రారంభం..
* నేటి నుంచి రెండు రోజులు పాటు శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో పర్యటించనున్న ఎమ్మెల్యే బాలకృష్ణ.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాల్లో పాల్గొనున్న టీడీపీ ఎమ్మెల్యే..
* నేడు ఉదయం రాజమండ్రి నుంచి గుంటూరుకు అంబటి రాంబాబు.. రాజమండ్రి నుంచి గుంటూరు వరకు భారీ ఊరేగింపుకు వైసీపీ శ్రేణుల సన్నాహాలు.. సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటి రాంబాబుకు బెయిల్..
* నేడు విశాఖలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటన.. మిలన్- 2026 నావికాదళ విన్యాసాలు, ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ కు హాజరు కానున్న రక్షణ శాఖ మంత్రి..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 14 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 10 గంటల సమయం..
* నేడు టీ20 వరల్డ్ కప్ లో ఉదయం 11 గంటలకి వెస్టిండీస్ వర్సెస్ ఇటలీ.. మధ్యాహ్నం 3 గంటలకి కొలంబో వేదికగా శ్రీలంక వర్సెస్ జింబాబ్వే.. రాత్రి 7 గంటలకి చెన్నై వేదికగా అప్ఘనిస్తాన్ వర్సెస్ కెనడా మ్యాచ్..
