Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today On 15th October 2023: తిరుమలలో శ్రీ శ్రీనివాసుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ఆరంభం కానున్నాయి. అక్టోబర్ 23వ తేదీ వ‌ర‌కు ఈ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. అంగరంగ వైభవంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు శ‌నివారం సాయంత్రం శాస్త్రోక్తంగా టీటీడీ అర్చకులు అంకురార్పణ చేపట్టారు. అంకూరార్పణ సందర్భంగా సేనాధిపతి విష్వక్సేనులవారు ఆలయ మాడ మాడవీధుల్లో ఊరేగుతూ శ్రీవారి బ్రహ్మహ్సవాల ఏర్పాట్లను పరీశీలించారు. అనంతరం వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ చేశారు.

నేడు తెలంగాణ భవన్‌కు సీఎం కేసీఆర్ రానున్నారు. అభ్యర్థులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్ లతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు. అభ్యర్థులకు బీఫారాలు సీఎం అందజేయనున్నారు. అలానే బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఇక సాయంత్రం హుస్నాబాద్ ఎన్నికల సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.

నేడు ముషీరాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. గంగపుత్రుల సమ్మేళనంలో కేంద్రమంత్రి పాల్గొననున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా నేడు విడుదల కానుంది. 58 పేపర్లతో తొలి జాబితాను తెలంగాణ విడుదల చేయనుంది.

నేడు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య భేటీ కానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి పొన్నాల రాజీనామా చేశారు.

ఏడుపాయల వనదుర్గమాత శరన్నవరాత్రి ఉత్సవాలు నేడు ఆరంభం కానున్నాయి. 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తుల రానున్నారు. నేడు అమ్మవారికి పట్టు వస్త్రాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా సమర్పించనున్నారు.

Also Read: Gold Price Today: మగువలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు! తులంపై ఏకంగా రూ. 1530

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ఆరంభం అయ్యాయి. నేటి నుండి తొమ్మిది రోజుల పాటు రోజుకో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మొదటి రోజు శైలపుత్రి అవతార అలంకారంతో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు కళ్యాణం, లింగార్చన, చండీ హోమం పూజలను ఆలయ అధికారులు రద్దు చేశారు.

ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది.

Exit mobile version