Site icon NTV Telugu

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today New

Whats Today New

* టీ 20 వరల్డ్‌ కప్‌: నేడు భారత్‌తో తలపడనున్న కెనడా.. రాత్రి 8 గంటలకు మ్యాచ్‌

* ఢిల్లీ: నేడు ఆర్ఎస్ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో యూపీ సీఎం యోగి భేటీ.. లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలిసారి ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌ను కలవనున్న యోగి

* హైదరాబాద్‌: నేడు సెక్రటేరియట్ లో పోడు భూములపై మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో అటవీశాఖ ఉన్నతాధికారులు, సీఎఫ్ లు, డీఎఫ్ఓ లు తదితరులతో సమావేశం

* ప్రకాశం : జిల్లా వ్యాప్తంగా బడి ఈడు పిల్లల్ని తిరిగి పాఠశాలలకు తీసుకు రావటమే లక్ష్యంగా బడికి పోతా కార్యక్రమాన్ని ప్రారంభించనున్న డీఈఓ సుభద్ర..

* ఒంగోలులో రేపు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభా యాత్ర..

* మార్కాపురం టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి విస్తృత స్థాయి సమావేశం..

* బాపట్ల : చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమవేశపు హాలులో కౌన్సిల్ సభ్యుల అత్యవసర సమావేశం..

* తిరుమల: 18వ తేదీ నుంచి ఆన్ లైన్ లో సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ

* అనకాపల్లి జిల్లా: నేడు పాయకరావుపేటకు రానున్న హోం మంత్రి వంగలపూడి అనిత… అనితను స్వాగతించేందుకు భారీ ర్యాలీ చేయనున్న టీడీపీ శ్రేణులు

* అన్నమయ్య జిల్లా : నేడు రాయచోటి పట్టణానికి రానున్న రవాణా, క్రీడ, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి సొంత నియోజకవర్గానికి వస్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. కడప-అన్నమయ్య జిల్లాల సరిహద్దులోని గువ్వలచెరువు నుండి రాయచోటి పట్టణానికి భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న టిడిపి కార్యకర్తలు, నాయకులు…

* నెల్లూరులోని జనసేన కార్యాలయంలో జనసైనికులతో సమావేశం కానున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

* అనంతపురం : రాయదుర్గంలో టీడీపీ శ్రేణుల విజయోత్సవ ర్యాలీ.

* అనంతపురం : గుత్తి లోని 220 కేవీ విద్యుత్ ఉప కేంద్రంలో మరమ్మతులు కారణంగా గుంతకల్, గుత్తి, పెద్దవడుగూరు మండలాల్లో విద్యుత్ సరఫరా బంద్,

* అనంతపురం : రేపు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు.ఏడు కేంద్రాలల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు. హాజరు కానున్న 2,795 మంది అభ్యర్థులు.

* తిరుపతి: నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నేపధ్యంలో వడమాలపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నూతన విద్యా సామగ్రి [విద్యా కానుక] పంపిణీ చేయానున్న నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్..

* తిరుపతి: ఈనెల 17 తేది నుండి పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ప్రారంభం

* అనంతపురం : శెట్టూరు, కుందుర్పి మండలంలో పర్యటించనున్న కలెక్టర్ వినోద్ కుమార్

Exit mobile version