NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

*నేడు కాకినాడలో పర్యటించనున్న సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. కలెక్టరేట్‌లో శాఖాపరమైన అంశాలు, తనిఖీలపై అధికారులతో సమీక్ష సమావేశం.. చెక్ పోస్ట్ ,పోర్ట్ ఏరియాను స్వయంగా తనిఖీ చేయనున్న మంత్రి.

*నెల్లూరు జిల్లా: నేడు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో పర్యటించనున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ఎం.ఆర్. కురూప్ ఆడిటోరియంలో జరిగే అంతరిక్ష వారోత్సవాల్లో పాల్గొననున్న పవన్ కళ్యాణ్.. అనంతరం షార్‌లోని వివిధ విభాగాల సందర్శన.. పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా భారీగా బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది

*అమరావతి: నేడు ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులతో జగన్ సమావేశం.. ఇవాళ , రేపు రెండు రోజులు సమావేశం కానున్న జగన్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో జగన్ సమావేశం

*విశాఖ: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు.. ఇప్పటివరకు రెండు నామినేషన్లు దాఖలు.. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ, మరో స్వతంత్ర అభ్యర్థి.. టీడీపీ తుది నిర్ణయంపై ఉత్కంఠ.. ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పుల వివరాలను పొందు పరిచిన బొత్స.. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత అప్పు 93లక్షలు, ఆస్తులు 73.14లక్షలు పెరిగినట్టు చూపించిన వైసీపీ అభ్యర్థి.

*నేడు గోదావరి యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశం.. సీతారామ ఎత్తిపోతల పథకం, సీతారామ బహుళార్థసాధక ప్రాజెక్టు పథకాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను జీఆర్‌ఎంబీకి సమర్పించనున్న తెలంగాణ.. జీఆర్‌ఎంబీ భేటీకి హాజరుకావాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు జీఆర్‌ఎంబీ సమాచారం పంపిన జీఆర్ఎంబీ.. ఈనెల 6న జరగాల్సిన ఈ సమావేశాన్ని తెలంగాణ అభ్యర్థన మేరకు నేటికి వాయిదా వేసిన గోదావరి బోర్డు

*నేడు అనంతపురం జిల్లాలో మంత్రులు పయ్యావుల, నిమ్మల పర్యటన.. తుంగభద్ర డ్యాంను సందర్శించనున్న మంత్రులు.. వరద ఉధృతికి కొట్టుకుపోయిన 19వ గేటును పరిశీలించనున్న మంత్రులు.. స్థానిక డ్యాం, ఇరిగేషన్‌ అధికారులతో భేటీ కానున్న పయ్యావుల, నిమ్మల.

*నేడు తుంగభద్ర డ్యామ్‌ను పరిశీలించనున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. వరద ఉధృతికి కొట్టుకుపోయిన 19వ గేటును పరిశీలించనున్న సిద్ధరామయ్య.. తుంగభద్ర ప్రాజెక్టును పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో కర్ణాటక సీఎం సమీక్ష.

*తిరుమల: 24 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 10 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 70,728 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 29,611 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.66 కోట్లు

*నేడు అహ్మదాబాద్‌లో హర్‌ఘర్‌ తిరంగా యాత్ర.. హర్‌ఘర్‌ తిరంగా యాత్రలో పాల్గొననున్న అమిత్‌ షా.

*నేడు కాంగ్రెస్ జాతీయ పార్టీ కీలక సమావేశం.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన భేటీ.. అతి త్వరలోనే తెలంగాణతో సహా, 8 రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షుల నియమాకంతో పాటు ఏఐసీసీ ప్రక్షాళన.. ఏఐసీసీ ప్రక్షాళనలో భాగంగా యువనేతలకు జాతీయ స్థాయిలో సెక్రటరీ, జనరల్ సెక్రటరీ పదవులు.. నేడు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇంచార్జ్‌లు, రాష్ట్రాల ఇంచార్జ్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీలతో విస్తృత సమావేశం.. దిశా నిర్దేశం చేయనున్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే.. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బృహత్తర కార్యాచరణ.. తెలంగాణ, కర్నాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు త్వరలో కొత్త పీసీసీ అధ్యక్షుల నియామకం… అలాగే, ఏఐసీసీ సెక్రటరీలు, జనరల్ సెక్రటరీలు, రాష్ట్రాలకు ఏఐసిసి ఇంచార్జ్ లను నియామకం చేయనున్న అధిష్టానం.

*తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం, వెండి ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.64,710.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.70,590.. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.87,400.

Show comments