NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

*నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ఉదయం 9 గంటలకు బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్.. ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి అచ్చెన్నాయుడు.. సుమారు రూ.2.7 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం.. 10 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ఏపీ ప్రభుత్వం.. ఇప్పటికే బడ్జెట్ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ.

*నేడు రేపు ఢిల్లీలో వరల్డ్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకులతో సీఆర్‌డీఏ ఒప్పందం.. బ్యాంకుల నుంచి రుణ సహకారంపై ఒప్పందం చేసుకోనున్న సీఆర్‌డీఏ అధికారులు.

*నేడు ఖమ్మంకు మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రులు.

*నేడు విజయనగరానికి ఎన్నికల పరిశీలకులు ఎం.ఎం నాయక్.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పరిశీలకులుగా ఐఏఎస్ ఎం.ఎం నాయక్.

*విజయనగరం: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ.. ఇవాళ వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న చిన్న అప్పలనాయుడు.

*విజయవాడ: నేటి నుంచి భవానీ దీక్షలు ప్రారంభం.. దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం, ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షలు.. డిసెంబర్‌ 25 వరకు కొనసాగనున్న భవానీ దీక్షలు.

*కార్తీక సోమవారం కావడంతో శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. తెల్లవారుజాము నుంచి మహాదేవుడి దర్శనానికి బారులు తీరిన భక్తులు.. పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదులుతున్న మహిళలు.. శివుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు.. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు.

*నేడు కేంద్ర మంత్రి బండి సంజయ్ ములుగు జిల్లా పర్యటన.. పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న కేంద్ర మంత్రి.

*ఢిల్లీ: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ఉదయం 10 గంటలకు సీజేఐగా ప్రమాణస్వీకారం చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా.. జస్టిస్ సంజీవ్ ఖన్నాతో ప్రమాణం చేయించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. వచ్చే ఏడాది మే 13 వరకు సీజేఐగా కొనసాగనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ఎన్నికల బాండ్లు, ఈవీఎంలు, ఆర్టికల్ 370 తదితర కేసుల్లో కీలక తీర్పులిచ్చిన జస్టిస్ సంజీవ్ ఖన్నా.

*బిహార్: సాయంత్రం 4.45 గంటలకు మహిళల ఆసియా ఛాంపియన్స్ హాకీ.. టైటిల్ నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో బరిలోకి సలీమా బృందం.. తొలి మ్యాచ్‌లో మలేసియాతో తలపడనున్న భారత మహిళల జట్టు.

Show comments