NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

*అమరావతి: నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం.. మిషన్‌ 202 లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న టీడీపీ.. పార్టీని సంస్థాగత బలోపేతంపై టీడీపీ పొలిట్‌ బ్యూరోలో చర్చ.. నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై చర్చ.. మిత్రపక్షాలకు ఇవ్వాల్సిన నామినేటెడ్‌ పదవులపై చర్చ.. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ ఫోకస్.

*నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండో రోజు ప్రజా ప్రతినిధులతో జగన్ సమావేశం.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దిశానిర్ధేశం చేయనున్న జగన్.

*అమరావతి: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. నేడు వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ.. మాజీ ఎంపీ నందిగం సురేష్, దేవినేని అవినాష్, తలశిల, అప్పిరెడ్డి పిటిషన్లపై విచారణ.

*నేడు బాలినేని పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ.. గన్‌మెన్లను తొలగించారని ఏపీ హైకోర్టులో బాలినేని పిటిషన్.. 2+2 గన్‌మెన్లను తొలగించారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పిటిషన్ దాఖలు.

*నేడు సంగారెడ్డిలో మంత్రి దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి పర్యటన.. మెడికల్ కాలేజ్‌, జిల్లా ఆస్పత్రి నిర్మాణ పనుల పరిశీలన.

*ప్రకాశం : ఇవాళ జిల్లా వ్యాప్తంగా పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు.. జిల్లాలోని 2315 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఎన్నికలు నిర్వహించనున్న అధికార యంత్రాంగం.

*అనంతపురం : జిల్లా వ్యాప్తంగా 1,741 చోట్ల విద్యా కమిటీ ఎన్నికలు.. వివాదాలకు తావు లేకుండా సజావుగా ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేసిన అధికారులు.

*విశాఖ జిల్లా: నేడు జరగాల్సిన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలకు బ్రేక్… ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో వున్నందున వాయిదా వేసిన విద్యాశాఖ.

*తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 13 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 08 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 75,109 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 30,285 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 3.4 కోట్లు

*నేడు బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రధానిగా మహ్మద్ యూనస్ ప్రమాణ స్వీకారం.. 15 మంది మంత్రులతో బంగ్లాదేశ్ కొత్త కేబినెట్.

*తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం, వెండి ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.63,490.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.69,260.. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.86,900.

*పారిస్ ఒలింపిక్స్‌: సాయంత్రం 5.30 గంటలకు స్పెయిన్‌తో భారత్‌ ఢీ.. నేడు పురుషుల హాకీలో కాంస్యం కోసం తలపడనున్న భారత్.. స్పెయిన్‌తో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 4 గెలిచిన భారత్.. ఒలింపిక్స్‌లో పది సార్లు తలపడ్డ భారత్-స్పెయిన్ జట్లు.. 7 మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లు డ్రా చేసిన భారత్.

*పారిస్‌ ఒలింపిక్స్‌: మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌లో పతకాన్ని కోల్పోయిన భారత్.. మహిళల 49 కిలోల విభాగంలో 4వ స్థానంలో నిలిచిన మీరాబాయి చాను.

*రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం.. రెజ్లింగ్‌కు వినేష్ ఫోగట్‌ గుడ్‌బై.. రెజ్లింగ్‌కు వీడ్కోలు చెప్పినట్లు వినేష్ ఫోగట్ ట్వీట్.. నాపై కుస్తీ గెలిచింది, నేను ఓడిపోయానంటూ ట్వీట్.