What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఐపీఎల్ 2024లో నేడు పంజాబ్‌తో చెన్నై ఢీ.. ధర్మశాల వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్.. లక్నోతో తలపడనున్న కోల్‌కతా.. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
* నేడు అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం
Also Read
- Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
- India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
- Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
* నేడు, ఈ నెల 9, 11 తేదీల్లో తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పర్యటన.. నేడు సిర్పూర్ కాగజ్‌నగర్, నిజామాబాద్, పేరెడ్ గ్రౌండ్ (మల్కాజ్ గిరి)లో సభలు.. 9న వికారాబాద్ లో సభ, 11న భువనగిరి, వనపర్తి సభల్లో పాల్గొననున్న అమిత్‌షా
* హైదరాబాద్: నేడు కాంగ్రెస్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం
* నిర్మల్: నేడు జిల్లాకు రానున్న రాహుల్ గాంధీ. జిల్లా కేంద్రంలోని క్రషర్ గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ. పాల్గొననున్న రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి.
* కొమరంభీం జిల్లా: నేడు కాగజ్‌నగర్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నిర్వహిస్తున్న వికాస సంకల్ప సభలో పాల్గొననున్న అమిత్ షా. ఎస్పీఎం గ్రౌండ్ లో ఏర్పాట్లు చేసిన బీజేపీ నేతలు.. మధ్యాహ్నం 2.30 గంటలకు సభ.
* నేడు నీట్ పరీక్ష.. ఉమ్మడి వరంగల్ జిల్లా నీట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి. వరంగల్ జిల్లా కేంద్రంలో 9 పరీక్ష కేంద్రాల ఏర్పాటు.. పరీక్షకు హాజరుకానున్న 5402 మంది విద్యార్థులు.. మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు పరీక్ష.. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ.. ఉదయం 11:30 నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతి
* తిరుపతి జిల్లాలో మొదలైన ఎన్నికల హడావిడి.. నేడు, రేపు ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించు కొనే అవకాశం.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి నియోజకవర్గాల వారీగా ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు.. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోనున్న 16571 మంది పోలింగ్ ఆఫీసర్స్,అనదపు పోలింగ్ ఆఫీసర్స్…
* ఇవాళ జగన్ ఎన్నికల ప్రచారానికి బ్రేక్..
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77,848 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 39,317 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.2.95 కోట్లు
* శ్రీ సత్యసాయి : ధర్మవరంలో ఎన్డీఏ కూటమి బహిరంగ సభ.. పాల్గొననున్న కేంద్ర మంత్రి అమిత్ షా, టిడిపి అధినేత చంద్రబాబు. ధర్మవరం బిజెపి అభ్యర్థి సత్య కుమార్ తరపున ఎన్నికల ప్రచారం చేయనున్న ముఖ్య నేతలు
* అన్నమయ్య జిల్లా: నేడు తంబలపల్లి నియోజకవర్గం లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం. మధ్యాహ్నం 3గంటలకు కురబలకోట మండలం అంగళ్లులో ప్రజాగళం సభ.
* అనంతపురం : ఇవాళ సాయంకాలం అనంతపురం చంద్రబాబు పర్యటన. నగరంలోని సప్తగిరి సర్కిల్ ప్రజాగళం సభ.
* ప్రకాశం : ఒంగోలులో ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* ప్రకాశం: తాళ్ళూరులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న దర్శి వైసీపీ అభ్యర్ధి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి..
* ప్రకాశం: కంభంలో ముస్లిం రాజకీయ చైతన్య అవగాహన కార్యక్రమం, ముఖ్యఅతిథిగా హాజరుకానున్న శాసన మండలి మాజీ చైర్మన్ ఎండి షరీఫ్..
* కర్నూలు: నేడు అదోనిలో కేంద్రమంత్రి రాజనాథ్ సింగ్ పర్యటన.. 3.25 కి ఎన్నికల బహిరంగసభ.. టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్న రాజనాథ్ సింగ్
* నేడు గుంటూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన.. పొన్నూరులో ఎన్నికల ప్రచారంలో భాగంగా, వారాహి యాత్రలో పాల్గొననున్న జనసేన అధినేత…
* కాకినాడ: నేడు తునిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్
* కడప : జిల్లాలో మొదలైన ఎన్నికల హడావిడి.. నేటి నుంచి మూడు రోజులపాటు పోలింగ్.. ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించు కొనే అవకాశం.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి నియోజకవర్గాల వారీగా ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు… ఈ రోజు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోనున్న 4757 మంది పోలింగ్ ఆఫీసర్స్,అనదపు పోలింగ్ ఆఫీసర్స్… రేపు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకో నున్న 8141 మంది ఓపిఓ లు (అదనపు పోలింగ్ సిబ్బంది ) …
* కాకినాడ: మేడి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా రోడ్ షో నిర్వహించనున్న హీరో సాయి ధరమ్ తేజ్
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రి రానున్న తెలంగాణ ITశాఖ, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి “దుద్దిళ్ళ శ్రీధర్ బాబు.. రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు జరిగే మీడియా సమావేశంలో పాల్గొననున్న శ్రీధర్ బాబు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు వైసీపీకి మద్దతుగా రాజమండ్రి చెరుకూరి గార్డెన్స్ లో కాపు సామాజిక వర్గం ఆత్మీయ సమావేశం.. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగునున్న సమావేశం
* కడప : నేడు బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారానికి ఏపీకి కేంద్రమంత్రి రాజనాధ్ సింగ్.. ఉదయం 9 గంటలకు ఢిల్లీలో బయలుదేరి 12 గంటలకు కడప చేరుకోనున్న కేంద్ర మంత్రి రాజనాధ్ సింగ్. మధ్యాహ్నం 12:25 కు జమ్మలమడుగులో ఏర్పాటు చేసిన బహిరంగసభకు హాజరు.. అనంతరం ఆధోని చేరుకోనున్న కేంద్ర మంత్రి రాజనాధ్ సింగ్.. మధ్యాహ్నం 3 గంటల నుంచీ 4 గంటల వరకూ ఆధోనిలో అక్కడి అసెంబ్లీ బిజెపి అభ్యర్ధి పి.వి.పార్ధసారధితో కలిసి బహిరంగ సభలో పాల్గొననున్న కేంద్ర మంత్రి రాజనాధ్ సింగ్
* తూర్పుగోదావరి జిల్లా: రేపు రాజమండ్రికి ప్రధాని నరేంద్ర మోడీ.. మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి వేమగిరి సెంటర్లో నిర్వహించనున్న ఎన్డీఏ కూటమి బహిరంగ సభ.. ప్రధాని మోడీ బహిరంగ సభ కోసం భారీగా ఏర్పాట్లు
* అనంతపురం : బొమ్మనహాళ్లు మండలంలో వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు.
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం మండలంలో జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు
* నెల్లూరు: కొడవలూరు ఇందుకుటుపేట మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న కోవూరు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
* నెల్లూరు: కోవూరులో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పర్యటన
* నెల్లూరు: దగదర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి
* నెల్లూరు: తోటపల్లి గూడూరు మండలంలోని వివిధ గ్రామాల్లో జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్న సర్వేపల్లి టిడిపి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
* నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గం లో జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న నెల్లూరు టిడిపి లోక్ సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఆత్మకూరు అసెంబ్లీ టిడిపి అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి
* నెల్లూరు: కావలి ..కోవూరు నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్న నెల్లూరు లోక్ సభ వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!