* ఏవోబీలో హై అలెర్ట్.. నేటి నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు.. ఏటా జులై 28 నుంచి ఆగస్టు 5 వరకు అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్న మావోయిస్టులు
* నేడు ఏపీ హైకోర్టు సీజేగా ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం. హాజరుకానున్న సీఎం జగన్.. బెజవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో జరగనున్న కార్యక్రమం
* తిరుమల: 23 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63,932 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 25,862 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ.4.13 కోట్లు
* ప్రకాశం : మార్కాపురం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్ ప్రారంభించనున్న మంత్రి ఆదిమూలపు సురేష్.. అనంతరం స్వచ్ఛభారత్ ఇ-ఆటోలను పారిశుధ్య కార్మికులకు పంపిణీ చేస్తారు..
* ప్రకాశం : నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. నేడు ఒంగోలు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు.. అనంతరం పలు గ్రామాల మీదుగా మద్ధిపాడు మండలం గుండ్లాపల్లి విడిది కేంద్రం చేరుకుని బస..
* ప్రకాశం : మార్కాపురం చెరువుకట్టపై రోడ్డు వేయనందుకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో ఒంగోలు రోడ్డులోని ఆంజనేయ స్వామి గుడి వద్ద రోడ్డుపై నిరసన కార్యక్రమం..
* విశాఖ: నేడు నగరానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తరువాత తొలిసారి నగరానికి వస్తున్న చిన్నమ్మకు గ్రాండ్ వెల్కం చెప్పనున్న బీజేపీ శ్రేణులు. ఎయిర్ పోర్ట్ నుంచి పార్టీ కార్యాలయం వరకూ ర్యాలీకి ఏర్పాట్లు.
* విశాఖ: నేడు బీజేపీ ఉత్తరాంధ్ర జిల్లాల జోనల్ మీటింగ్. VMRDA చిల్డ్రన్ ఏరీనాలో జరగనున్న సమావేశంలో పాల్గొననున్న రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి
* తిరుమల: శ్రీనివాస సేతు ప్రైఓవర్ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా.. ఆగస్టు 8వ తేదీన శ్రీనివాస సేతు ప్లై ఓవర్ ప్రారంభోత్సవం చేసేలా ఏర్పాట్లు.. మొన్న రాత్రి జరిగిన ప్రమాదంతో పనులు పూర్తి కావడానికి నెల రోజులు పట్టే అవకాశం.. దీనితో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైయ్యే సెప్టెంబర్ 18వ తేదీన శ్రీనివాస సేతు ప్లై ఓవర్ ని సీఎం జగన్ ప్రారంభించే అవకాశం
* శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ నెల 30న ఉదయం 6 గంటల 30 నిముషాలకు P.S.L.V. C-56 రాకెట్ ప్రయోగం.. సింగపూర్ కు చెందిన ఉపగ్రహాలను కక్షలోకి పంపనున్న ఇస్రో.. రాకెట్ ప్రయోగానికి ముగిసిన రిహార్సల్స్.. రేపు కౌంట్ డౌన్ ప్రారంభం, శ్రీహరికోటకు రానున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్
* తూర్పుగోదావరి: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 14.3 అడుగుల వద్ద నిలకడగా కొనసాగుతున్న గోదావరి వరద ప్రవహం.. బ్యారేజీ నుండి 13 లక్షల 57 వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల, కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు, పొదలకూరులలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరులో జరగనున్న రొట్టెల పండగకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించనున్న నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి
* తూర్పుగోదావరి జిల్లా : అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి ‘ఆడుదాం ఆంధ్ర’ ఐదు దశల్లో ఆటల పోటీలు. 17 ఏళ్లు నిండిన యువతీయువకులు అర్హులు..
* అంబేద్కర్ కోనసీమ: ధవళేశ్వరం బ్యారేజీ నుండి గోదావరి వరద దిగువకు ఉధృతంగా ప్రవహిస్తున్న దృష్ట్యా కోనసీమ జిల్లాకు ముంపు ప్రమాదం.. ప్రజలకు సహాయం కోసం కోనసీమ జిల్లాలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు. అమలాపురం కలెక్టర్ కార్యాలయం టోల్ ఫ్రీ నెంబర్: 18004252532, అమలాపురం ఆర్డీఓ కార్యాలయం : 08856 233208, 8008803201, రామచంద్రాపురం ఆర్డీవో కార్యాలయం : 08857 245166, కొత్తపేట ఆర్డీఓ కార్యాలయం : 9154983102
* అనంతపురం : నేడు హెచ్చెల్సీకి తుంగభద్ర నుంచి నీటి విడుదల. 500 క్యూసెకుల నీటిని విడుదల చేయనున్న అధికారులు.
* నంద్యాల: నేడు శ్రీశైలంలో అమ్మవారి ఆలయంలో శ్రీస్వామి, అమ్మవారికి ఊయలసేవ, ప్రత్యేక పూజలు
* పల్నాడు : వినుకొండలో కొనసాగుతున్న టెన్షన్ వాతావరణం.. 144 సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులు.. నిన్నటి ఘర్షణ నేపథ్యంలో ఘర్షణకు కారణమైన వారి పై రాళ్లు రువ్విన వారిపై కేసులు పెట్టేందుకు వీడియో ఫుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు…
* గుంటూరు: నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం, లక్షలాది మొక్కలను నాటనున్న అధికారులు, ప్రజాప్రతినిధులు.
* అనంతపురం : కళ్యాణదుర్గం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో మంత్రి ఉషశ్రీ చరణ్ సమావేశం.
* జయశంకర్ భూపాలపల్లి జిల్లా: అత్యంత ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్న గోదావరి.. ఎగువన కురుస్తున్న వర్షాలు.. ప్రాణహిత నది నుంచి భారీ వరదతో గోదావరి ఉగ్రరూపం.. మేడి గడ్డ వద్ద గోదావరి ఉగ్రరూపం.. రికార్డు స్థాయిలో గోదావరి నదికి భారీ వరద.. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు భారీగా పోటెత్తిన వరద. బ్యారేజీ గేట్లన్నీ పూర్తిగా ఎత్తిన అధికార యంత్రాంగం,
* జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం వద్ద గోదావరి మహోగ్రరూపం. పుష్కర్ ఘాట్లను ముంచిన వరద. కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక.
* మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి కాలనీ, పద్మశాలి నగర్ లోనీ పెద్దమ్మ గుడి ప్రాంతాల్లోకి ప్రవేశించిన వరద నీరు.. ముందు జాగ్రత్త గా నిన్న మధ్యాహ్నం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు.
* నల్లగొండ జిల్లా: మూసి ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద.. ఇన్ ఫ్లో 38,767 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 56,070 క్యూసెక్కులు… 9 గేట్ లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు.
* గోదావరికి మళ్ళీ పెరుగుతున్న వరద, గత రాత్రి నాలుగు అడుగుల వరకు తగ్గి మళ్ళీ పెరగడం ప్రారంభం.. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 46.20 అడుగులు. కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
* ములుగు జిల్లా: రామన్న గూడెం పుష్కర ఘాట్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు. రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద వేగంగా పెరుగుతున్న గోదావరి ఉధృతి.. 14.900 మీటర్లకు చేరిన గోదావరి, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు
* ములుగు జిల్లా: వాజేడు మండలం పేరూర్ వద్ద క్రమేపీ పెరుగుతున్న గోదావరి నీటిమట్టం.. అప్రమత్తమైన అధికారులు ముందస్తు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు, రేగుమగు వాగు పొంగి జాతీయ రహదరి 163 పై చేరిన వరద నీరు .
* తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు రాకపోకలు అంతరాయం, ప్రజలు ఎటువంటి సాహసాలు చేయవద్దు అని భారీగేట్లు ఏర్పాటు చేసిన పోలీసులు.
* నిజామాబాద్ : శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ కి కొనసాగుతున్న వరద. ఇన్ ఫ్లో 2 లక్షల 33 వేల 504 క్యూసెక్కులు, 32 గేట్ల ద్వారా 1లక్షల 70వేల 612 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల