* నేడు కృష్ణా బోర్డు ప్రత్యేక సమావేశం.. హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ పై చర్చ.
* అమరావతి: ఇవాళ, రేపు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన.. రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణ, సన్నద్ధత వంటి అంశాల పరిశీలన.. నిన్న రాత్రే విజయవాడ చేరుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని టీమ్.. ఈ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం.. మధ్యాహ్నం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమీక్ష
* అమరావతి: నేడు ఆర్థిక శాఖ పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష.. ఉదయం 11 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశం
* అమరావతి: వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసి నేటికి ఐదేళ్లు.. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్న వైసీపీ.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు, హాజరుకానున్న నేతలు, కార్యకర్తలు, అభిమానులు
* అమరావతి: నేడు కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశంకానున్న వైసీపీ.. హాజరుకానున్న ఎంపీలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్.. టీడీపీ ఓటర్ల నమోదులో అవకతవకలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేయనున్న వైసీపీ.. మొన్న తెలంగాణలో ఓట్లు వేసిన ఏపీ ఓటర్లు రేపు మళ్లీ ఏపీలో ఓట్లు వేయకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయనున్న వైసీపీ
* ఖమ్మం: నేడు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశం.. పార్లమెంట్ ఎన్నికలపై రివ్యూ
* ఏపీలో 29వ రోజు కొనసాగనున్న అంగన్వాడీ కార్యకర్తల నిరసన కార్యక్రమాలు..
* ఏపీలో మున్సిపల్ కార్యాలయాల వద్ద 15వ రోజు కొనసాగనున్న కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనలు.
* ప్రకాశం : దర్శిలో జనసేన ఇంచార్జీ గరికపాటి వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎద్దుల పందాలు ఫైనల్స్, కార్యక్రమానికి హాజరుకానున్న పలువురు టీడీపీ, జనసేన ముఖ్య నేతలు..
* తిరుమల: 14వ తేదీతో ముగియనున్న ధనుర్మాసం.. 15వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃరుద్దరణ
* ప్రకాశం : మార్కాపురంలో వెలుగొండ ప్రాజెక్ట్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ..
* తూర్పుగోదావరి జిల్లా: రేపటి నుండి రాజమండ్రి మీదుగా సంక్రాంతికి ఐదు ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైళ్లు.. అటు విశాఖ, ఇటు విజయవాడ మీదుగా ఆయా ప్రాంతాలకు రైలు ప్రయాణికుల సౌకర్యార్థం ఐదు సంక్రాంతి ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైళ్లను నడువుతున్న దక్షిణ మధ్య రైల్వే.. విశాఖ – సికింద్రాబాద్, సికింద్రాబాద్- కాకినాడ, కాకినాడ-తిరుపతిల మధ్య ఈ ప్రత్యేక సంక్రాంతి రైళ్లు ఏర్పాటు.. ఈ నెల 10,11, 12, 13, 16, 17 తేదీలలో ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైళ్లు రాకపోకలు
* గుంటూరు: నేడు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ రెండవ రోజు పాదయాత్ర.. తెనాలి మండలం అంగలకుదురు నుండి ప్రారంభమవునున్న పాదయాత్ర..
* గుంటూరు: నేడు నంబూరులో గుంటూరు కారం ఫ్రీ రిలీజ్ ఫంక్షన్, హాజరుకానున్న సినీ హీరో మహేష్ బాబు తదితరులు…
* పల్నాడు: సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 12 నుంచి 17 వరకు ఈపూరు మండలం ముప్పాళ్ళలో రైతు మిత్ర జాతీయస్థాయి కబడ్డీ పోటీలు..
* విశాఖ: నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెక్యులరిజం సవాళ్లు పై సమావేశం. పాల్గొననున్న పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, కొప్పుల రాజు, మాజీమంత్రి జేడీ శీలం
* విశాఖ: నేడు జీవీఎంసీ సర్వసభ్య సమావేశం.. జనరల్ ఎలక్షన్ నోటిఫికేషన్ రానుండటంతో ప్రత్యేక బడ్జెట్ మీటింగ్. కార్పొరేటర్లకు సంక్రాంతి కానుకగా గిఫ్ట్ ఓచర్లపై చర్చకు విపక్ష కార్పొరేటర్లు అడిగే అవకాశం. మేయర్ పంపిన గిఫ్ట్ కార్డులను తిరస్కరించిన సీపీఎం, జనసేన కార్పొరేటర్లు.
* అనంతపురం జిల్లా పర్యటనలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి.
* నగరిలో మంత్రి ఆర్కే రోజా పర్యటన
* నెల్లూరులోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ నేతలతో జిల్లా పార్టీ అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి సమావేశం
* నెల్లూరు రూరల్ పరిధిలోని కనపర్తిపాడులో ఇంటింట ప్రచారం నిర్వహించనున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
* నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో అంబేద్కర్ సామాజిక న్యాయం అనే అంశంపై సదస్సు పాల్గొననున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
* నెల్లూరు నగరంలోని 32 వ డివిజన్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి
* శ్రీ సత్యసాయి : గోరంట్ల మండలం పాలసముద్రంలోని గ్రేట్ వే విల్లాస్ లో రొద్ధం, పరిగి మండలాల నాయకులతో సమావేశం కానున్న మంత్రి ఉషశ్రీ చరణ్.
* అనంతపురం : గుంతకల్లు పట్టణంలో సామాజిక సాధికార బస్సు యాత్ర. యాత్రలో పాల్గొననున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నందిగామ ఎంపీ సురేష్, మంత్రి ఉషశ్రీ చరణ్.
* పశ్చిమ గోదావరి: తణుకు నియోజకవర్గం రెలంగిలో ప్రజాదీవెన పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి కారుమూరి
* విజయవాడ: దేవాదాయ శాఖ సమీక్షా సమావేశానికి హాజరుకానున్న మంత్రి కొట్టు సత్యనారాయణ
* తూర్పుగోదావరి జిల్లా: నేటి నుండి అధిక శబ్దాలతో ధ్వని కాలుష్యం సృష్టిస్తున్న ద్విచక్ర వాహనాలు నడిపే వారిపై చర్యలకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్న రాజమండ్రి ట్రాఫిక్ పోలీసులు
* విజయవాడలో నేడు యూటీఎఫ్ ఆధ్వర్యంలో 36 గంటల దీక్షకు పిలుపు.. అనుమతిలేదని ఎవరూ రావద్దని ఇప్పటికే పోలీసుల ఆదేశాలు, ముందస్తు చర్యల్లో భాగంగా నోటీసులు ఇస్తున్న పోలీసులు
* కాకినాడ: రేపు తుని నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. చామవరంలో రా కదలిరా బహిరంగ సభ లో పాల్గొనున్న బాబు
* శ్రీ సత్యసాయి : హిందూపురం నియోజకవ వర్గంలో రెండవ రోజు కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న ఎమ్మెల్యే బాలకృష్ణ. హిందూపురం మున్సిపాలిటీలో వార్డుల వారీగా సమీక్ష.
* అనంతపురం : నగరంలో ఆడుదాం – ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మారథాన్ రన్ కార్యక్రమం.
* విజయవాడ: నేడు నగరానికి కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్.. గుడ్లవల్లేరు లో జరిగే కార్యక్రమానికి రానున్న మంత్రి
* విజయవాడలో మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు.. నిడుబ్రోలు వెళ్లి అక్కడ నుంచి గన్నవరం విమానాశ్రయం వచ్చి హైద్రాబాద్ వెళ్లనున్న గవర్నర్
* మంత్రి బూడి ముత్యాలనాయుడు నేటి కార్యక్రమాలు.. దేవరాపల్లి మండలం నాగయ్య పేట గ్రామంలో అభివృద్ది పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారు.. దేవరాపల్లి సచివాలయం 1 పరిధిలో గడప గడపకు మన దృష్టికి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు.
* నంద్యాల: నేడు శ్రీశైలం జలాశయాన్ని సందర్శించనున్న ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, సీడబ్ల్యూసీ అధికారులు.. డ్రిప్ ప్రాజెక్టు నిధుల వినియోగంపై సమీక్ష.. ప్రపంచ బ్యాంక్, రాష్ట్రప్రభుత్వం నిధుల వాటా గురించి చర్చించనున్న ప్రపంచ ప్రతినిధులు, అధికారులు
* కర్నూలు: నేడు మంత్రాలయం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన
* కర్నూలు: నేడు ఆలూరు లో మంత్రి జయరాం ఇంటి ఆవరణలో వైసీపీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ముఖ్య నేతల సమావేశం… ఆలూరు టికెట్ పై ఎటూ తేల్చలేదని ముఖ్యనేతల సమావేశం. మంత్రి జయరాంకు టికెట్ ఇవ్వకుంటే రాజీనామా చేస్తామని నేతలు ప్రకటించే అవకాశం
* చిత్తూరు : ఎస్ఆర్ పురం మండలం కొత్తపల్లి మిట్ట జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి
* చిత్తూరు: ఉదయం 11 గంటలకు పెనుమూరు మండలంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి అనుకూల వర్గం 6 మండలాలు నాయకులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఆత్మీయ సమావేశం…
* తూర్పుగోదావరి జిల్లా: నేడు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ షెడ్యూల్.. ధవళేశ్వరం జక్కంపూడి సీతారత్నం కళ్యాణ మండపంలో దళితుల ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
* కర్నూలు: నేడు ఆలూరు లో మంత్రి జయరాం ఇంటి ఆవరణలో వైసీపీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ముఖ్య నేతల సమావేశం…
* విజయనగరం జిల్లా: ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నెల్లిమర్ల లో భారీ బైక్ ర్యాలీ.. జనసేన నాయకురాలు లోకం మాధవి ఆధ్వర్యంలో చెలిమర్లలో భారీ బైక్ ర్యాలీ.. సాయంత్రం ఐదు గంటలకు రామతీర్థం జంక్షన్లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన జనసైనికులు
* శ్రీ సత్యసాయి : హిందూపురంలో రెండవ రోజు పంచాయితీ వారీగా సమావేశాలు నిర్వహించనున్న రీజనల్ కో ఆర్డినేటర్, ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రూరల్ పరిధిలోని ఏడు పంచాయతీల వారిగా నాయకులు,కార్యకర్తలతో సమావేశం.
* అనంతపురం : రాయదుర్గం పట్టణంలోని షాదీమహల్ లో టిడిపి ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సదస్సు.
* కర్నూలు: నేడు ఆలూరులో జనసేన విస్తృత స్థాయి సమావేశం