* కడప జిల్లాలో నేడు మూడో రోజు సీఎం జగన్ పర్యటన.. ఉదయం 9 గంటలకు పులివెందులోని సీఎస్ఐ చర్చికి సీఎం జగన్.. సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్ధనల్లో పాల్గొననున్న సీఎం జగన్, సతీమణి వైఎస్ భారతి, తల్లి విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు
* మెదక్ సీఎస్ఐ చర్చిలో ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు.. మొదటి ఆరాధనతో వేడుకలను ప్రారంభించిన బిషప్ పద్మారావ్.. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న భక్తులు
* మెదక్ CSI చర్చిలో రద్దీ.. ఉదయం 4.30 గంటల నుంచే చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు.. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర దేశాల నుంచి భారీగా వచ్చిన భక్తులు.. చర్చి ఆవరణలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
* నేడు సంగారెడ్డి జిల్లాలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన.. ప్రజాపాలన కార్యక్రమంపై జిల్లా అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించనున్న మంత్రి
* ఉమ్మడి మెదక్ జిల్లాని వణికిస్తున్న చలి.. సంగారెడ్డి జిల్లాలో 7.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు, మెదక్ జిల్లాలో 10.8 డిగ్రీలు, సిద్దిపేట జిల్లాలో 11.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
* ఖమ్మం: నేడు జిల్లాలో నేడు ఇద్దరు మంత్రుల పర్యటన.. మంత్రి తుమ్మల ఖమ్మంలో వివిధ కార్యక్రమాలు పాల్గొంటారు.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి mains పై కార్మిక సంఘం ఎన్నికలపై పార్టీ నేతల తో సమీక్ష నిర్వహిస్తారు
* ప్రకాశం : టంగుటూరులో మాజీ జెడ్పీ చైర్మన్ పోతుల చెంచయ్య 27వ వర్ధంతి కార్యక్రమం, హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే బాలవీరంజనేయ స్వామి, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్..
* ప్రకాశం : క్రిస్మస్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు ప్రధాన చర్చిలలో ప్రత్యేక ప్రార్ధనలు..
* ప్రకాశం : ఇవాళ క్రిస్మస్ పండుగ సందర్భంగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం రద్దు..
* తిరుమల: రేపు టిటిడి పాలకమండలి సమావేశం
* తిరుమల: ముగిసిన సర్వదర్శన భక్తులుకు వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేటాయింపు.. పది రోజులుకు సంబంధించిన 4.25 లక్షల టోకెన్లు కేటాయించిన టీటీడీ
* ఉమ్మడి విశాఖలో కరోనా ఉధృతి.. తాజాగా 11కేసులు నమోదు.. జిల్లాలో 18కి చేరిన బాధితుల సంఖ్య….
* అరకులోయ పర్యటకానికి హాలిడేస్ ఎఫెక్ట్.. అనూహ్యంగా పెరిగిన రద్దీ. టూరిస్టులతో కిక్కిరిసిన జలపాతాలు, బొర్రా కేవ్స్.. హోటళ్లు, రిసార్ట్స్ హౌస్ ఫుల్.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు క్రిస్మస్ పండగ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కారణంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం రద్దు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా 5కే రన్. రాజమండ్రి సిటీ వై జంక్షన్ నుండి లాలాచెరువు వరకు రన్
* ఏలూరు : మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటన వివరాలు.. ఊటూరు మండలం గోపీనాథ పట్నంలో ఆంజనేయ స్వామి ఆలయ పూజా కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి
* శ్రీ సత్యసాయి : మడకశిర మండల పరిధిలోని భక్తరహళ్లి లక్ష్మీనరసింహాస్వామి, జిల్లెడుగుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు స్వామి వారి కళ్యాణోత్సవం.
* అనంతపురం : క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని కలెక్టరేట్ జరగాల్సిన స్పందన కార్యక్రమం రద్దు.
* నెల్లూరు జిల్లాలోని పలు చర్చిలలో క్రిస్మస్ వేడుకలు.. నెల్లూరు నగరం సంతపేట లోని ఆర్.సి.ఎం.చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.. నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి నారాయణ దంపతులు
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తోటపల్లి గూడూరు మండలం కోడూరు చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు
* నంద్యాల: నేడు శ్రీశైలంలో శ్రీస్వామి అమ్మవార్లకు ఆలయంలో సహస్ర దీపాలంకరణ, వెండి రథోత్సవం
* కర్నూలు: నేడు బిషప్ చర్చి, కోల్స్ చర్చి సహా పలు క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో క్రిస్మస్ వేడుకలు
* తిరుమల: నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63,519 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 26,424 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.5.05 కోట్లు
* నెల్లూరు జిల్లా: జనవరి 1న ఉదయం 9 గంటల 10 నిముషాలకు PSLV C-58 రాకెట్ ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు.. ఈ రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన ఎక్స్ పో శాట్ ఉపగ్రహంతో పాటు మరో రెండు నానో శాటిలైట్ లను కక్ష్యలోకి పంపనున్న శాస్త్రవేత్తలు.. శ్రీహరికోటలో చురుగ్గా కొనసాగుతున్న రాకెట్ అనుసంధాన ప్రక్రియ
* తిరుమల: శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం.. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఇప్పటికే 7 లక్షల దర్శన టోకెన్లు జారీ చేసిన టీటీడీ.. దర్శన టోకెన్లు కలిగిన భక్తులనే దర్శనానికి అనుమతిస్తున్న టీటీడీ.. జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు.. జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసిన టీటీడీ
* రాజన్నసిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజన్న ఆలయంలో పోటెత్తిన భక్తులు.. వరుసగా సెలవు రోజుల రావడంతో రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి.. తెల్లవారుజామునుండే స్వామివారి దర్శనానికి క్యూలైన్లో బారులు తీరిన భక్తులు.. స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం