* అమరావతి: ఆరోగ్య శ్రీ కార్యక్రమంపై నేడు సీఎం వైఎస్ జగన్ సమీక్ష.. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశం.. ఈ నెల 18 నుంచి ఆరోగ్య శ్రీ కొత్త కార్డులు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో ఆరోగ్య శ్రీ కొత్త కార్డులు, ఆరోగ్య శ్రీ డ్రైవ్ పై చర్చించనున్న సీఎం జగన్
* భద్రాద్రి: నేటి నుంచి భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు.. నేడు మత్స్యావతారంలో దర్శనం ఇవ్వనున్న రామయ్య
* ఇవాళ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర
* అమరావతి: నేడు కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం.. హాజరుకానున్న ఏఐసీసీ, ఏపీసీసీ ముఖ్యనేతలు
* విశాఖ: నేడు సింహాచలం అప్పన్న దేవాలయంలో పోలి పాడ్యమి ఉత్సవం.. సింహాద్రి అప్పన్న వరాహ పుష్కరిణికి భారీగా తరలివచ్చిన భక్తులు.. పుష్కరిణిలో అరటి డోప్పలలో దీపాలను వదిలి తమ కోర్కెలు తీర్చుకుంటున్న భక్తులు
* విశాఖ: నేడు ఆడుదాం ఆంధ్ర స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించనున్న వైసీపీ.. NAD జంక్షన్ నుంచి DLB గ్రౌండ్ వరకు యువజన విభాగం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ.. ముఖ్య అతిథులుగా రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, పాల్గొననున్న మంత్రి గుడివాడ అమర్నాథ్, క్రికెటర్ అంబటి రాయుడు.
* విశాఖ: నేటి నుంచి ఉత్తరాంధ్ర ఇలవేల్పు, బురుజుపేట కనకమహా లక్ష్మి అమ్మవారి మార్గ శిర మాసోత్సవాలు ప్రారంభం.. ఈ ఏడాది ఆరు లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వస్తారని అంచనా
* ప్రకాశం : పెద్ద దోర్నాలలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొననున్న మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..
* విజయనగరం: సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నేడు వాకిన్ రిక్రూట్మెంట్.. గాజులరేగ సమీపంలోని ట్రైబల్ యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ 6వ విడత వాకిన్ రిక్రూట్మెంట్ కు అభ్యర్థులు దరఖాస్తుతో పాటు తమ ఒరిజనల్ సర్టిఫికెట్లను కూడా తీసుకురావాలని సూచించిన నిర్వాహకులు.
* శ్రీ సత్యసాయి : అమరాపురం , పరిగి మండలాల్లో పర్యటించనున్న కేంద్ర కరువు బృందం సభ్యులు.
* అనంతపురం : కళ్యాణదుర్గంలో పర్యటించనున్న మంత్రి ఉషశ్రీ చరణ్
* విజయవాడ: నేడు బెజవాడలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సమావేశం.. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నాయకులపై నమోదైన కేసులపై సమీక్ష చేయనున్న కమిటీ
* నేడు తిరుపతిలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. సాయంత్రం 5 గంటలకు తాజ్ హోటల్ లో ఓ వివాహ రిసెప్షన్ కు హాజరుకానున్న సీఎం జగన్
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముత్తుకూరు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు..
* నెల్లూరు: తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా
* నెల్లూరు నగరంలోని లీలామహల్ సెంటర్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
* తూర్పు గోదావరి జిల్లా: కార్తీక మాసం ఆఖరి రోజు పోలి పాడ్యమి కావడంతో రాజమండ్రిలో గోదావరి భక్తులతో కిటకిటలాడుతున్న స్నానఘట్టాలు. వేలాదిగా తరలివచ్చి గోదావరిలో కార్తీక స్నానాలు ఆచరిస్తున్న భక్తులు.. కిక్కిరిసిన రాజమండ్రిలో పుష్కరఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్లు .
* శ్రీ సత్యసాయి : ముదిగుబ్బ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి నేడు రూ. 50 లక్షలతో చేపట్టనున్న పైపులైను పనులకు భూమి పూజ.
* శ్రీ సత్యసాయి : అభివృద్ధికి అండగా ఉందాం అభివృద్ధి నిరోధకలను తరిమికొడదాం అనే నినాదంతో ధర్మవరం పట్టణంలో నేడు వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీ.
* విజయనగరం: నేటి నుంచి ధాన్యం ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం కొనుగోలు. తుఫాన్ కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలలో తడిసిన ధాన్యం రంగు మారినా.. ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఏ రైతు కూడా ఆధార్యపడద్దంటున్న అధికారులు..
* తూర్పు గోదావరి జిల్లా: నేటి నుంచి లోక కల్యాణార్ధం రాజమండ్రి ఎంపీ, మార్గాని భరత్ దంపతులచే యాగ మహోత్సవం.. నేటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు యాగం.
* కర్నూలు: ఇవాళ, రేపు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన.. జిల్లాలో కరువు పరిస్థితులను అంచనా వేయనున్న బృందం