What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వార్నింగ్
* అమరావతి: నేడు ఆర్ధిక శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష, ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆదాయ, వ్యయాలపై సంబంధిత అధికారులతో చర్చ
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేటి నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన, రాజమండ్రి రూరల్, మండపేట, కొత్తపేట, అమలాపురం నియోజకవర్గాల్లో కార్యక్రమాలు, రోడ్ షోలు, సదస్సులు, భవిష్యత్తుకు గ్యారంటీ బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు
* విశాఖ: నేటి మధ్యాహ్నం నగరానికి చేరుకోనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్, 6వ రోజు వారాహి విజయ యాత్రలో భాగంగా భీమిలి నియోజకవర్గంలో పర్యటన. జియో హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందిన ఎర్రమట్టి కొండలను పరిశీలించనున్న పవన్, ప్రకృతి సంపదను రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం ధ్వంసం చేస్తున్నారని ఆరోపిస్తోన్న జనసేనాని
* నెల్లూరు జిల్లా: ఓటర్ల జాబితా పరిశీలనపై నెల్లూరులో అధికారులతో నేడు కలెక్టర్ హరి నారాయణ సమావేశం
* తిరుపతి: ఈ నెల 25వ తేదీన వరలక్ష్మీ వ్రతం సందర్భంగా స్వర్ణరథోత్సవం పై విహరించనున్న శ్రీపద్మావతి అమ్మవారు
* అనంతపురం : రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం.. ముస్తాబ్తెన హనుమద్ క్షేత్రాలు.
* అనకాపల్లి జిల్లా: నేడు నాతవరం మండలం బమిడికలొద్ది అటవీ ప్రాంతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బృందం పర్యటన.. వివాదాస్పద లేట్రైట్ మైనింగ్ ప్రాంతాలను పరిశీలించనున్న NGT బృందం.. బమిడికలొద్దిలో లేట్రైట్ తవ్వకాలు నిబంధనలకు విరుద్ధమని, పర్యావరణంకు హాని చేస్తున్నారని ఫిర్యాదులు.
* నేటి నుండి రెండు రోజులపాటు బాపట్లలో పర్యటించనున్న వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డి.. బాపట్ల జిల్లాలోని పలు నియోజకవర్గాల నాయకులు, పార్టీ శ్రేణులతో సమావేశంకానున్న ఎంపీ విజయసాయిరెడ్డి.
* గుంటూరు: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేటి నుండి 19 వరకు అంగన్వాడీల పోరుయాత్ర …
* అల్లూరి సీతా రామరాజు జిల్లా: నేడు పాడేరులో వైఎస్సార్ సీపీ సమన్వయ సమావేశం.. హాజరుకానున్న రీజనల్ కో ఆర్డినేటర్ సుబ్బారెడ్డి..
* కర్నూలు: అమావాస్య సందర్భంగా హాళగుంద మండలం దేవరగుట్టులో మాళమల్లేశ్వరస్వామి ఆలయంలో కుంకుమార్చన, మహా మంగళారతి, ప్రత్యేక పూజలు, అన్నదానం
* ఏలూరు : సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లోనే ద్వారకా తిరుమల చిన వెంకన్న సేవ టికెట్లు, ఇకపై ఆన్‌లైన్‌లోనే లభించనున్న నిత్యార్జిత కళ్యాణం, ఆర్జిత బ్రహ్మోత్సవం, అష్టోత్తరం, సుప్రభాత సేవ టిక్కెట్లు, ఆన్‌లైన్ ద్వారా మాత్రమే సేవా టికెట్లు విక్రయించాలని దేవాదాయ శాఖ ఉత్తర్వులు
* చిత్తూరు: పెనుమూరు మండలం పులికల్లు సచివాలయం పరిధిలో గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి
* తిరుపతి: నేడు టీటీడీ పరిపాలన భవనం ముందు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామి మరియు హిందూ JAC నాయకులు కలిసి నిరసన కార్యక్రమం.. నడకదారి భక్తుల పై మరియు ద్విచక్ర వాహనాల్లో వచ్చే భక్తులపై టీటీడీ పెట్టిన కఠినమైన ఆంక్షలను పూర్తిగా వ్యతిరేకిస్తూ తక్షణమే ఆంక్షలను తొలగించాలని డిమాండ్.
* నంద్యాల : శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా కొనసాగుతున్న వరద.. ఇన్ ఫ్లో 7,778 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 19,070 క్యూసెక్కులు, పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 862.10 అడుగులు.. ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
* తిరుపతి: శ్రీకాళహస్తి దేవస్థానం నుండి ధర్మ ప్రచార రథం ప్రారంభించనున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
* విశాఖ: నేడే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ప్రారంభం.. ప్రారంభ వేడుకల్లో సందడి చేయనున్న సినీనటి శ్రీలీలా.. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ACA ఆధ్వర్యంలో జరగనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కి సర్వం సిద్ధం. ఇవాళ తొలి మ్యాచ్‌లో తలపడనున్న కోస్టల్ రైడర్స్ – బెజవాడ టైగర్స్
*హైదరాబాద్: రేపటి నుంచి ఎంసెట్ ప్రత్యేక విడత కౌన్సిలింగ్..
* విజయవాడ: 17న జరగాల్సిన చలో విద్యుత్ సౌధ కార్యక్రమం వాయిదా.. కొత్త తేదీ ఒకట్రెండు రోజుల్లో తెలుపుతామని ప్రకటన
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..