What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఐపీఎల్: నేడు ముంబై ఇండియన్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఢీ.. రాత్రి 7.30 గంటలకు ముంబై వేదికగా మ్యాచ్
* తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. నేడు ఏపీలో 129 మండలాల్లో తీవ్ర వడగాలులు.. శ్రీకాకుళంలోని 8 మండలాల్లో తీవ్ర వడగాలులు..
Also Read
* నేడు, రేపు తెలంగాణలో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్.. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
* తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,120.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,110
* నేడు రంజాన్ కారణంగా సీఎం వైఎస్ జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బ్రేక్.. నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీకానున్న వైఎస్ జగన్
* అంబెడ్కర్ కోనసీమ జిల్లా: నేడు కోనసీమలోని అమలాపురం, పి.గన్నవరంలో పర్యటించనున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్.. పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో జరగబోయే ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొననున్న ఇద్దరు నేతలు.. మధ్యాహ్నం అంబాజీపేట, సాయంత్రం అమలాపురం బహిరంగ సభలో పాల్గొననున్న టీడీపీ అధినేత, జనసేనాని.. బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు
* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేడు నారా చంద్రబాబు , పవన్ కల్యాణ్ ఉమ్మడి బహిరంగ సభ దృష్ట్యా అమలాపురంలో ట్రాఫిక్ మళ్లింపు.. అమలాపురం మీదుగా వెళ్ళు వాహనాలకు అమలాపురం పట్టణంలోకి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అనుమతి లేదు. కాకినాడ, రాజమండ్రి, రాజోలు, పి.గన్నవరం వైపు వెళ్ళే వాహనాలను వివిధ మార్గాల్లో మళ్ళింపు.
* హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు.. నేటి నుంచి ఐదు రోజులపాటు బీజేపీ పార్లమెంట్‌స్థాయి బూత్ అధ్యక్షుల సమ్మేళనాలు.. నేడు భువనగిరి బీజేపీ పార్లమెంట్ సన్నాహక సమావేశం.. రాష్ట్ర బీజేపీ నేతల అధ్యక్షతన సమ్మేళనాలు.. నేడు, రేపు, ఎల్లుండి మండలస్థాయి సమావేశాలు
* ప్రకాశం : దర్శి నియోజకవర్గం లోని అన్నీ మండలాల్లో వైసీపీ కార్యకర్తలతో ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, దర్శి ఎమ్మెల్యే అభ్యర్ధి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి..
* నెల్లూరు : కందుకూరు నియోజకవర్గం లోని వలేటివారిపాలెం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి వై విజయసాయిరెడ్డి, కందుకూరు ఎంఎల్ఏ అభ్యర్ధి బుర్రా మధుసూదన్ యాదవ్..
* కడప : రాజంపేట లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి.
* కడప నగరంలో ని ఈద్ఘా వద్ద రంజాన్ పండుగ ప్రార్థనలలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం అంజాద్ బాష.
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలంలో జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు
* నెల్లూరు రూరల్ మండలం సౌత్ మోపూర్ లో జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
* నెల్లూరు: జిల్లాలో ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించనున్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా
* తిరుపతి: శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం.
* తిరుపతి: మహతి కళాక్షేత్రంలో 10:30 గంటలకు మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతి కార్యక్రమం…
* శ్రీ సత్యసాయి : ఈనెల 19న హిందూపురంలో నామినేషన్ వేయనున్న ఎమ్మెల్యే బాలకృష్ణ. ఈనెల 13వ తేదీ నుంచి లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లో బాలకృష్ణ తరపున ప్రచారాలను నిర్వహించనున్న బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి
* శ్రీ సత్యసాయి : ధర్మవరం పట్టణంలోని cnb కళ్యాణ మండలంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం.
* తిరుమల: 13 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,570 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 24,446 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 3.53 కోట్లు
* నంద్యాల: బనగానపల్లె (మం) నందవరంలో శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతి మహోత్సవాల్లో భాగంగా నేడు అమ్మవారి రాయబార మహోత్సవం
* పశ్చిమగోదావరి జిల్లా: తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరగనున్న కాపు సామాజిక వర్గ ఆత్మీయ సమావేశం.. పాల్గొనున్న ముద్రగడ పద్మనాభం
తాజావార్తలు
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్తో పరిష్కారం దొరికినట్లే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!