NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

ఇవాళ ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. ఒక వివాహ కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారు.

ఇవాళ ఉదయం 11 గంటలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర బడ్జెట్, సూపర్ సిక్స్ హామీల అమలు, అన్నదాతల కష్టాలు, అక్రమ అరెస్టులు సహా అనేక అంశాలపై మీడియాతో జగన్ మాట్లాడనున్నారు.

ఈరోజు ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. మండలిలో టీడీపీ, సభ్యుల మాటల యుద్ధం కొనసాగుతోంది.

నేడు విశాఖ నగరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రానున్నారు.

ఇవాళ విజయవాడ స్తెబర్ క్త్రెం పోలీసుల ఎదుట మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ హాజరుకానున్నారు. ఇప్పటికే సెక్షన్ 35 బార్ త్రిబిఎన్ఎస్ఎస్ కింద గోరంట్లకు పోలీసులు నోటీసు ఇచ్చారు.

వైసీపీ నేత వల్లభనేని వంశీ కేసులో నిందితుల కస్టడీ నేటితో ముగియనుంది. కేసులో ఏ4 వీర్రాజు, ఏ10 వంశీ బాబు ఇద్దరిని రెండు రోజులు కస్టడీకి న్యాయస్థానం ఇచ్చిన విషయం తెలిసిందే.

నేడు రాజమండ్రీలో సీపీఐ జిల్లా స్థాయి కార్యకర్తల వర్క్ షాప్ జరగనుంది. రాజమండ్రి సీపీఐ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది.

నేటి నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయి.

యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు ఉదయం శ్రీకృష్ణ అలంకారంలో భక్తులకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనమివ్వనున్నారు. సాయంత్రం పొన్న వాహన సేవ ఉంటుంది.

నేడు కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్ భేటీ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో భాగంగా నేడు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య సెమీస్ మ్యాచ్ జరగనుంది. లాహోర్ గడ్డాఫీ స్టేడియంలో మధ్యాహ్నం 2.30 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది.