NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

ఇవాళ ఏపీ అసెంబ్లీలో 2025-26 ఏపీ బడ్జెట్‌పై చర్చ జరగనుంది. వివిధ కేటాయింపులు, సంక్షేమానికి నిధులు లాంటి పూర్తి అంశాలపై చర్చించనున్నారు. మండలిలో బడ్జెట్‌పై చర్చకు సంబంధించి ప్రస్తుతం ఉన్న అప్పులు, సూపర్ సిక్స్ అమలు వంటి వివిధ అంశాలను వైసీపీ సభ్యులు లెవనెత్తె ఆలోచనలో ఉన్నారు.

ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ రానున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరి ఫ్లైట్‌లో 5.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి జగన్ చేరుకోనున్నారు.

నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.

నేడు కడప కోర్టులో సినీ నటుడు పోసాని కృష్ణమురళి బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై విచారణ జరనుంది.

నేడు వైసీపీ నేత వల్లభనేని వంశీ పిటిషన్‌పై ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది.

మహానంది క్షేత్రంలో నేడు స్వామివారికి రుద్రాభిషేకం, సాయంత్రం పల్లకి సేవ ఉంటుంది.

ఇవాళ సాయంత్రం ఎమ్మెల్యేలతో మంత్రి నారా లోకేష్ సమావేశం కానున్నారు.

నేడు అశ్వాపురం సీతారామ ప్రాజెక్ట్ బీజీ కొత్తూరు పంప్ హౌస్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరావు సందర్శించనున్నారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో 10వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతదేహాల వెలికితీత కష్టతరంగా మారింది.

ఈరోజు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి డిల్లీకి బయలుదేరనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులతో భేటి కానున్నారు.

డిప్యూటీ సీఎం భట్టి ఉదయం 9.30కి రాజస్థాన్ వెళ్లనున్నారు. రాజస్థాన్ ప్రభుత్వంతో సింగరేణి ఎంఓయూ కుదుర్చుకోనుంది.

నేటి నుంచి ఎమ్మెల్యే కోటా ఐదు ఎమ్మెల్సీ స్ధానాలకు నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఈనెల 10 వతేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.