NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

ఇవాళ ఉద‌యం 11 గంట‌ల‌కు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఎస్ఐపీబీ అమోదించిన లక్ష 80 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ అమోదం తెల‌ప‌నుంది. సమావేశం తర్వాత మంత్రులతో సీఎం సమావేశం కానున్నారు. కొత్త ఏడాదిలో మంత్రులకు కొత్త టార్గెట్లను విదించనున్నారు.

నేడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పుస్తక మహోత్సవం ఆరంభం కానుంది. విజయవాడ బుక్ ఎక్జిబిషన్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. ఇవాల్టి నుంచి 11రోజుల పాటు పుస్తక ప్రదర్శన జరగుతుంది.

ఇవాళ మధ్యాహ్నం 2.30కి సీఎం చంద్రబాబుతో పృధ్వీ రాజ్ జిందాల్ భేటీ కానున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు జిందాల్ సంస్థ నడుపుతోంది. మరో రెండు ప్లాంట్లు త్వరలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

నేడు కడప జిల్లాలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పర్యటించనున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోటను కేంద్రమంత్రి పరిశీలించనున్నారు.

మహిళల ఉచిత బస్ ప్రయాణంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ నేడు కర్ణాటకకు వెళ్లనుంది. రేపు బెంగుళూరులో కర్ణాటక రవాణా శాఖామంత్రి, అధికారులతో సమావేశం కానుంది.

ఈరోజు సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. రైతు భరోసా విధివిధానాలపై చర్చ జరగనుంది.

నేడు ఖమ్మం జిల్లాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నారు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న ముక్కోటి వైకుంఠ అధ్యయనోత్సవాలలో భాగంగా మూడవ రోజైన నేడు వరాహవతారంలో భక్తులకు స్వామి వారు దర్శనమివనున్నారు.

తెలంగాణలో నేటి నుంచి ఈ నెల 20 వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

నేడు ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు చిత్రానికి పూజా కార్యక్రమం జరగనుంది. హైదరాబాద్‌లోని రాజమౌళి ఆఫీస్‌లో పూజా కార్యక్రమం జరగనుండగా.. జనవరి చివరి వారం నుంచి షూటింగ్ మొదలు కానుంది.

Show comments