ఉదయం 10 గంటలకు కొత్త ఓటర్లతో ప్రధాని మోడీ వర్చువల్ గా సంభాషించనున్నారు. బేగంపేట ఉమెన్స్ కాలేజీలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
తిరుమలలో ఈరోజు రామకృష్ణ తీర్ద ముక్కోటి జరగనుంది. ఉదయం 5 గంటల నుంచి మధ్యహ్నం 12 గంటల వరకు భక్తులను టీటీడీ అనుమతించనుంది. ఉదయం 7:30 గంటలకు శ్రీవారి ఆలయం నుండి రామకృష్ణ తీర్దానికి అర్చక బృందం వెళుతుంది. గోగర్భం డ్యాం నుంచి భక్తుల తరలింపుకి ఆర్టీసీ బస్సులను టీటీడీ ఏర్పాటు చేసింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా కోనసీమ జిల్లాలోని అయినవిల్లి, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లో భువనేశ్వరి పర్యటిస్తారు. రాత్రి అమలాపురం సత్యనారాయణ కళ్యాణ మండపంలో బస చేసిన భువనేశ్వరి… చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించిన సమయంలో వేదనకు గురై అసువులు బాసిన కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందించనున్నారు.
పీసీసీ ఛీప్ వైఎస్ షర్మిల నేడు కాకినాడలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలపై షర్మిల కార్యకర్తలతో చర్చించనున్నారు.
గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ బూత్ కన్వీనర్ల సమావేశం జరగనుంది. ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాష్ట్ర ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
నేడు సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటించనున్నారు. మొగుడంపల్లి మండలం ఉప్పర్ పల్లిలో జరిగే మోతిమాత ఉత్సవాల్లో మంత్రి దామోదర పాల్గొననున్నారు.
Also Read: Hyderabad Test: భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు.. ఉప్పల్‌లో ఉదయం 9.30 నుంచి మ్యాచ్ ఆరంభం!
ప్రపంచ క్రికెట్లో రెండు బలమైన జట్లు భారత్, ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడబోతున్నాయి. గురువారమే తొలి టెస్టు ఆరంభం కానుండగా.. మన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియమే వేదిక. ఈ మ్యాచ్ ఉదయం గం.9:30 నుంచి స్పోర్ట్స్ 18,జియో సినిమాలలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
అండర్-19 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై విజయంతో బోణీ కొట్టిన భారత జట్టు మరో పోరుకు సిద్ధమైంది. గురువారం ఐర్లాండ్‌తో భారత్ తలపడనుంది. బ్లూమ్‌ఫౌంటీన్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ఆరంభం.
