NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

నేడు వ్యూహం సినిమాపై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. వ్యూహం సినిమాపై ఏపీ హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. సోనియా, కాంగ్రెస్ పరువుకు భంగం కలిగించేలా సినిమాను చిత్రీకరించాలని పిటిషనర్ పేర్కొన్నారు. సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ను పునఃపరిశీలించాలని కోరారు.

నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భీమవరంలో పర్యటించనున్నారు. ‘విద్యా దీవెన’కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో సీఎం పాల్గొనున్నారు.

మాజీమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి నేడు మలివిడత సీఎం జగన్‌తో భేటీ కానున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ అభ్యర్థుల ఖరారు నేడు దాదాపు పూర్తయ్యే అవకాశం ఉంది. బాలినేనితో భేటీ అనంతరం సీఎం జగన్ అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉంది.

నేడు కాకినాడలో జరగనున్న బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి హాజరుకానున్నారు. రెండో రోజు పార్టీ ముఖ్య నేతలు, జిల్లాకు చెందిన పలువురు ప్రజా సంఘాలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో సమావేశం కానున్నారు.

నేడు గుంటూరు జిల్లాలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్షుక్ మాండవీయ పర్యటించనున్నారు. పొన్నూరు మండలం మామిళ్ళపల్లిలో ఆయుష్మాన్ ఆరోగ్య భవనంలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని మంత్రి పరిశీలించనున్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో ప్రధానమంత్రి ఆరోగ్య సేవా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఎయిమ్స్ విద్యార్థులతోనూ ముఖాముఖిలో కేంద్రమంత్రి పాల్గొననున్నారు.

మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులను దగ్గరుండి చూసేందుకు ఇవాళ మంత్రుల బృందం అక్కడికి పోతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు నేడు కాళేశ్వరం ప్రాజెక్టును ఏరియల్ సర్వే చేసిన తర్వాత మేడిగడ్డ డ్యామ్ 19, 20, 21 పిల్లర్లు ఎందుకు కుంగిపోయాయో దగ్గరకు వెళ్లి చూస్తారు. ఈ పిల్లర్లు కుంగిపోవడం వల్ల తెలంగాణ- మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోవడానికి గల కారణాలను పరిశీలిస్తారు.

Also Read: IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో భారత్ ఘోరపరాభవం!

రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలో పలు ప్రైవేట్ కార్యక్రమాలలో సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశాలలో కేటీఆర్ మాట్లాడనున్నారు.

రెండో రోజు సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటించనున్నారు. జిల్లాలో పలు కార్యక్రమాల్లో మంత్రి దామోదర పాల్గొననున్నారు.