NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహించనున్నారు. సాయంత్రం సీఎం ఢిల్లీకి పయనం కానున్నారు. రేపు ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరుకానున్నారు.

ఇవాళ గుంటూరు జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి గుంటూరు మిర్చి యార్డ్‌కు బయలుదేరనున్నారు.

మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్‌లు అమరావతిలో పలు కార్యక్రమాలకు హాజరవుతారు.

జేఎన్టీయూ కాకినాడ వైస్ ఛాన్సలర్‌గా సీఎస్ ఆర్కే ప్రసాద్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆర్కే ప్రసాద్ మూడేళ్ల పాటు వీసీగా కొనసాగనున్నారు.

నేడు మంత్రి నారా లోకేష్ తిరుపతిలో పర్యటించనున్నారు. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

అనంతపురం నగరంలోని కాశీవిశ్వేశ్వర కోదండరామాలయంలో నేటి నుంచి మహాశివరాత్రి ద్వాదశ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

వల్లభనేని వంశీ కేసులో పిటిషన్లు మీద నేడు ఎస్సీ, ఎస్టీ కోర్టు విచారణ జరగనుంది. వంశీ బెయిల్, కస్టడీ పిటిషన్ల మీద నేడు ఇరు వర్గాలు కౌంటర్లు దాఖలు చేయనున్నాయి.

నేడు రాయచోటి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ భాష అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది.

శ్రీశైలంలో నేటి నుండి మార్చి 1 వరకు.. 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

నేడు వీరరాఘవరెడ్డి రెండోరోజు కస్టడీ విచారణ కొనసాగనుంది. మొదటిరోజు కస్టడీ విచారణలో మొయినాబాద్ పోలీసులు కీలక విషయాలు రాబట్టారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ బన్సల్ ఈరోజు తెలంగాణలో పర్యటించనున్నారు.

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బంగారు విమాన గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవము
నేటి నుండి ప్రారంభం కానుంది.

నేడు మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి తెలంగాణ భవన్ కి రానున్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ పాల్గొననున్నారు.

నేడు ఉదయం 10.30 గంటలకు కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

నేటి నుంచే ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఆరంభం కానుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. మధ్యాహ్నం 2.30కు మ్యాచ్ ఆరంభం కానుండగా.. స్టార్‌ స్పోర్ట్స్, స్పోర్ట్స్‌-18లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.