నేడు అన్నవరానికి కలెక్టర్ షాన్ మోహన్ వెళ్లనున్నారు. ఆలయంలో జరుగుతున్న సంఘటనలు, ఇతర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
ఇవాళ బాపట్ల జిల్లా మేదరమెట్లకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్లనున్నారు. అనారోగ్యంతో మృతి చెందిన వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ బౌతిక ఖాయానికి నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.
ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనమండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 2023-24 ఏపీ రహదారుల అభివృద్ధి సంస్థ 28వ వార్షిక నివేదికను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు.
ప్రజాప్రతినిధుల క్రీడా సంబరాలకు సమయం ఆసన్నమైంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈ పోటీలు జరగనున్నాయి. గురువారం ముగింపు ఉత్సవం నిర్వహిస్తారు.
నేటి నుంచి 24 వరకు ఆన్ లైన్లో జూన్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఇవాళ లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్ల విడుదల కానున్నాయి.
ఈరోజు పోసాని కృష్ణమురళిని గుంటూరు సీఐడీ కార్యాలయంలో అధికారులు విచారించనున్నారు. ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకూ సీఐడీ విచారించనుంది.
నేటి నుంచి మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పూర్వపు పీఠాధిపతులు శ్రీ సూయతీంద్రతీర్దుల 12వ సమారాధన ఉత్సవాలు ఆరంభం కానున్నాయి.
ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉంది.
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ప్రధాని మోడీతో సీఎం భేటీ కానున్నారు. అమరావతి పునఃప్రారంభానికి ప్రధానిని ఆహ్వానించనున్నారు. రాజధాని నిధులతో పాటు పలు అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు.
న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. యూనివర్సిటీ ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ ఉదయం 8 గంటలకు ఆరంభం అవుతుంది.