Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య నువ్వా, నేనా అన్నట్లుగా మండలి సమావేశాలు సాగుతున్నాయి.

ఇవాళ విచారణకు రావాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు ఇవ్వనుంది. కాకినాడ సీ పోర్టు షేర్లు బదిలీ వ్యవహారంపై విజయ సాయిరెడ్డిపై సీఐడీ కేసు నమోదు చేసింది.

వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 9 గంటలకు పార్టీ జెండాను అధినేత వైఎస్ జగన్ ఆవిష్కరించనున్నారు.

వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు నాయకులు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని అన్ని కార్యాలయాలు వద్ద వైసీపీ జెండాలు ఎదురు వేయటానికి సన్నాహాలు చేశారు.

ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపి యువత పోరు, అలానే వైసీపీ ఆవిర్భావ దినోత్సవం కూడా. రాష్ట్ర వ్యాప్తంగా జెండావిష్కరణలు, అనంతరం ధర్నాలు చేయనున్న నేతలు.

విద్యార్థులు, యువత సమస్యలపై వైసీపీ ఆధ్వర్యంలో ఈరోజు యువత పోరు జరగనుంది. జిల్లాపరిషత్ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన కొనసాగనుంది.

వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై ఎస్సీ, ఎస్టీ కోర్టు నేడు విచారణ జరపనుంది.

నేటి నుండి మద్దికేర (మం) పెరవలి శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. స్వామి వారికి మంగళ హారతి, కుంకుమార్చన, అభిషేకాలు, పంచామృత సేవలతో ప్రత్యేక పూజలు జరగనున్నాయి.

ఇవాళ శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలలో నాలుగోవ రోజు. శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి తెప్పలపై విహరించనున్నారు.

నేటితో టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ 19వ రోజుకు చేరింది. GPR, క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు చేస్తున్నారు.

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రసంగం చేస్తారు. ఈ నెల 19న తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.

నేడు రవీంద్ర భారతిలో జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలు అందించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి 1,292 మంది జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలు ఇవ్వనున్నారు.

ఈరోజు ఖమ్మం అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి మంత్రి తుమ్మల శంఖుస్థాపన చేయనున్నారు.

నేడు భూమా నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా మంచు మనోజ్, మౌనిక దంపతులు ఆళ్లగడ్డకు రానున్నారు. శోభ ఘాట్ వద్ద భూమా నాగిరెడ్డికి మనోజ్, మౌనికలు నివాళులర్పించనున్నారు.

 

Exit mobile version