NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whatstoday

Whatstoday

*తిరుమలలో ఇవాళ పౌర్ణమి గరుడ సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి

*నేడు వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా సాయం

*అనంతపురం జిల్లాలో పర్యటించనున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ.. ప్రభుత్వ ఆస్పత్రిలోని వసతులను క్షేత్రస్థాయి పరిశీలించనున్న మంత్రి.

*నేడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటన

*అమరావతి ఆర్-5 జోన్‌పై నేడు తీర్పు ఇవ్వనున్న ఏపీ హైకోర్టు.. మధ్యాహ్నం 2.15 గంటలకు తీర్పు ఇవ్వనున్న న్యాయస్థానం.. అమరావతికి ఇచ్చిన భూములను పేదలకు కేటాయిస్తున్నారని పిటిషన్ వేసిన రైతులు

*తిరుపతి జిల్లాలో నేటి నుంచి బీజేపీ ఛార్జిషీట్ ఉద్యమం

*వైఎస్‌ వివేకా కేసు.. నేడు సీబీఐ కోర్టులో లొంగిపోనున్న ఎర్ర గంగిరెడ్డి

*నేడు వైశాఖ పౌర్ణమి సందర్భంగా సింహాద్రి అప్పన్నకు చందన సమర్పణ

*తిరుపతి జిల్లా: నేడు తాతయ్య గుంట గంగమ్మ మూల విరాట్ ప్రాణ ప్రతిష్ఠ

*వరంగల్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన.

*నేడు చంద్ర గ్రహణం..‘పెనుంబ్లార్‌ లూనార్‌’గా పిలిచే చంద్ర గ్రహణం ఏర్పడనుందని తెలిపిన ప్లానెటరీ సొసైటీ ఇండియా డైరెక్టర్

Show comments