NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

*విశాఖ: నేడు సీఎం సమక్షంలో వైసీపీలో చేరనున్న పలువురు ముఖ్య నాయకులు.. జనసేన నుంచి వైసీపీలోకి గంపల గిరిధర్… 2019లో దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గిరిధర్.. ఇప్పటికే వైసీపీలో చేరిన జనసేన అసంతృప్త నాయకుడు మూగి శ్రీనివాస్.

*విశాఖ: 20వ రోజుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. గ్రేటర్ విశాఖ పరిధిలో రోడ్ షో నిర్వహించనున్న సీఎం జగన్.. రాత్రి బస క్యాంప్‌ నుంచి బయలుదేరి పినగాడి, లక్ష్మీపురం మీదుగా వేగుంట చేరుకోనున్న బస్సు యాత్ర.. భోజనం విరామం తర్వాత కోర్ సిటీలో సాగనున్న సీఎం పర్యటన.. ఎన్‌ఏడీ, కంచర పాలెం, రైల్వే న్యూ కాలనీ, గురుద్వారా , వేంకోజీ పాలెం మీదుగా సాగనున్న బస్సు యాత్ర.

*తిరుమల: నేటి నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు.. ఇవాళ శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి వారికి స్నపన తిరుమంజనం.. రేపు స్వర్ణరథంపై మాడవీధులలో ఊరేగనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి.. మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ

*పశ్చిమ గోదావరి: నేడు నరసాపురం, భీమవరంలో పవన్ కళ్యాణ్ పర్యటన.. సాయంత్రం 5గంటలకు నరసాపురంలో బహిరంగ సభ పాల్గొని అనంతరం రాత్రి 8గంటలకు భీమవరంలో సభకు హాజరుకానున్న పవన్ కళ్యాణ్..

*ఇవాళ పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలు ఇవ్వనున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. కొన్ని సెగ్మెంట్లల్లో అభ్యర్థిత్వాల మార్పుపై తర్జన భర్జన.. కొలిక్కి రాని సీట్లల్లోని అభ్యర్థులకు బీ-ఫారాల జారీని పెండింగులో పెట్టే ఛాన్స్.

*నిర్మల్ జిల్లాలో ఇవాళ మంత్రి సీతక్క పర్యటన.. బాసర అమ్మవారిని దర్శించుకుని పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా తానూర్, ముధోల్, బాసర మండలాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మంత్రి సీతక్క.

*ఐపీఎల్‌: నేడు కోల్‌కతా, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌.. కోల్‌కతా వేదికగా మధ్య మధ్యాహ్నం 3.30 గంటలకు మధ్య మ్యాచ్.. రాత్రి 7.30 గంటలకు చండీగఢ్ వేదికగా పంజాబ్‌, గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్.

*తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 74,240.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 68,050.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.90,000.