Site icon NTV Telugu

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

*తిరుమల: ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు.. ఇవాళ శ్రీరాముని అవతారంలో తెప్పలపై విహరించనున్న స్వామివారు.. ఈ సందర్భంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ

*కడప : నేటి నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి కడప జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన.. న్యాయం గెలవాలి అనే కార్యక్రమంలో భాగంగా నేడు రాయచోటి నియోజకవర్గంలో పర్యటన.

*కోరుకొండ: నేడే ప్రసిద్ధిగాంచిన కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం.. మధ్యాహ్నం 2 గంటలకు రథోత్సవం, రాత్రి 9 గంటలకు శ్రీ నరసింహ స్వామి వారి కళ్యాణం.. నేటి నుండి ఐదు రోజులపాటు జరగనున్న నరసింహ స్వామి తీర్థ మహోత్సవాలు.

*జగిత్యాల జిల్లా: నేటి నుంచి ఏప్రిల్‌ 1 వరకు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు.. ఈరోజు పాల్గుణ శుద్ధ ఏకాదశిన అంకురార్పణ వరాహ తీర్థం, పుట్ట బంగారంతో ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు.. గురువారం రోజున గోధూళి సుముహూర్తమున ముగ్గురు స్వామి వార్ల కల్యాణం

*ఢిల్లీ: నేటి నుంచి కొనసాగనున్న కాంగ్రెస్ సీఈసీ సమావేశాలు.. నేడు తెలంగాణ కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. తెలంగాణలో 8 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్న కాంగ్రెస్‌.

*నేడు చెన్నైకి కిషన్‌రెడ్డి.. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై తమిళ నేతలతో చర్చించనున్న కిషన్‌ రెడ్డి.

*తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,330.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,800.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,300.

*తిరుమల: నేరుగా శ్రీవారి దర్శనం.. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో వేచి ఉండే అవకాశం లేకుండా దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63, 251 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 20,989 మంది భక్తులు.. హుండీ ఆదాయం 4.14 కోట్లు

Exit mobile version